కొన్ని దశాబ్దాలుగా ఆ కలియుగ దైవం వెంకన్నకు సేవ చేసిన రమణ దీక్షితులు, గత కొన్ని రోజులుగా అమిత్ షా సేవలో తరించటం చూసాం, జగన్ ఇంటికి వెళ్లి ఆశీర్వదించటం చూసాం, అన్యమతస్తులతో చెట్టాపట్టాలేసుకుని తిరగటం చూసాం. రమణ దీక్షితులు వెనుక రాజకీయ నాయకులు ఉన్నారనేది స్పష్టం. ఈ మాటలకు బలం చేకురుస్తూ, భూమన కరుణాకరరెడ్డి నిన్న మాట్లడారు. ‘మా నాయకుడు జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే జరిగే మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో తొలి అజెండాలోనే వయస్సు కారణంగా తొలగించిన రమణదీక్షితులతో పాటు ఇతర ముగ్గురు అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటాం. అర్చకులందరికీ పదవీ విరమణ లేకుండా చేయటంతోనే రాష్ట్రంలో జగన్ పరిపాలన మొదలవుతుంది’ అని వైసీపీ ప్రధాన కార్యదర్శి,
తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం రమణదీక్షితులు ఇంటికి వచ్చిన కరుణాకరరెడ్డి ఆయనతో సుమారు 35 నిమిషాలు భేటీఅయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మిరాశీ కుటుంబాలకు చెందిన ప్రధాన అర్చకులు రమణదీక్షితులను అక్రమంగా తీసేవేయటం చాలా బాధకలిగించిందన్నారు. కొద్దిరోజుల క్రితం కర్నాటక ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరుమలకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో దీక్షితులు మంతనాలు జరిపారు. ఆ తర్వాతే ఆరోపణలపర్వం ప్రారంభించారు. ముందుగా చెన్నైలో ఆ తర్వాత ఢిల్లీలో ఈ తరహా ఆరోపణలు చేశారు. అప్పడే టీటీడీ ఆయనకు రిటైర్డ్మెంట్ ప్రకటించింది.
ఆ తర్వాత కూడా దీక్షితులు ఆరోపణలపర్వం కొనసాగించారు. నేరుగా జగన్‌తో దీక్షితుల భేటీ కావటం, ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలవటం, అన్యమతస్థులతో కలిసి తిరిగటం, అంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూరింది. రమణదీక్షితులు మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితులుగా ఉన్నారనే ఆరోణలున్నాయి. 2003లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం కావాలని అప్పట్లో కొండపై యాగం చేశారని ప్రచారం జరిగింది. నిబంధనలకు విరుద్ధమైనా పట్టించుకోలేదనే విమర్శలు ఆయనపై వచ్చాయి. ఇప్పటికీ దీక్షితులు తన ఇంట్లో శ్రీవారి చిత్రపటం పక్కన వైఎస్ చిత్రపటం పెట్టుకుంటారనే ప్రచారం ఉంది.