పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా దాఖలు చేసిన ఒరిజినల్ సూట్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. విచారణ అంశాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం కోర్టుకు అందజేశాయి. ఇంకా ఏమైనా డాక్యుమెంట్లు ఉంటే రెండు వారాల్లోగా తమకు అందజేయాలని ఒడిశాను ధర్మాసనం ఆదేశించింది. ఒడిశా దాఖలు తర్వాత మిగిలిన రాష్ట్రాలకు మరో రెండు వారాల గడువు ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టును ఆపాలంటూ ఒడిశా మరో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. సాఫ్ట్వర్క్ ఆర్డర్‌ను పదే పదే నిలుపుదల చేయడంపై కోర్టుకు అభ్యంతరం తెలియజేస్తూ పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో ఏపీ, కేంద్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ ఆదేశించింది.
పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ రేలా అనే సంస్థ మరో పిటిషన్ దాఖలు చేసింది. పోలవరంతో లక్షలాది గిరిజనులు నిర్వాసితులవుతున్నారంటూ ఇంకో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యేందుకు రేలా సంస్థ ఎవరని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రాజెక్టు వల్ల ఇబ్బందులు ఉంటే ఆయా రాష్ట్రాలు చూస్తాయి కదా అని జస్టిస్ మదన్ బీ లోకూర్ ఆ సంస్థను ప్రశ్నించారు. ప్రజల ఇబ్బందులపై ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారా అని రేలాను ప్రశ్నించగా లేదని ఆ సంస్థ తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి తెలియజేశారు. అలాంటప్పుడు సుప్రీం కోర్టుకు ఎలా వస్తారంటూ ధర్మాసనం ప్రశ్నించింది.
పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలు ఏపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తుండగా.. తాజాగా తెలంగాణ, ఒడిశా ప్రభుత్వాలు అభ్యంతరం తెల్పడంతో పోలవరం ప్రాజెక్ట్ పనులకు మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కావాలనే చేపిస్తున్నారా అనే అనుమానాలు కూడా ప్రభుత్వ లేవనెత్తుతుంది. ఒక పక్క కేంద్రం నుంచి వచ్చిన అన్ని కమిషన్లు, పనులు బాగా జరుగుతున్నాయని, పర్యావరణం, గిరిజనులకు ఇబ్బంది లేకుండా, వారికి కావలసినవి అన్నీ చేస్తున్నారని చెప్తున్నా, కేసులు మాత్రం వేస్తూనే ఉన్నారు. ఒక్క చోట అన్నా స్టే రాక పోతుందా అనే ఆశతో, ఒకరి తరువాత ఒకరు, ఎలాగైనా పోలవరం ప్రాజెక్ట్ ఆపటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.