మేధావి మౌనం సమాజానికి ప్రమాదకరం అంటారు. నాకు అన్నీ తెలుసు, కాని చైర్మన్‌గా ఉన్నందుకే ఏపి సమస్యల పై మౌనంగా ఉన్నాను అంటున్నారు వెంకయ్య నాయుడు గారు. అంటే దీని అర్ధం ఏంటి సార్ ? మీకు ఆ పదవి ముఖ్యమా, లేక మీ పార్టీ ముఖ్యమా ? రాష్ట్రం ఏమి అయిపోయినా పరవాలేదా ? మీరు నోరు తెరిచి, అప్పుడేమి జరిగింది, ఇప్పుడేమి జరిగుతుంది అని నిలదీస్తే, 5 కోట్ల ఆంధ్రుల గుండెల్లో, చిర స్థాయిగా నిలిచిపోతారు. నిన్న వెంకయ్య మాట్లాడుతూ, ‘‘అప్పుడేం జరిగిందో, సభలో ఎవరేం మాట్లాడారో అందరికీ తెలుసు. ఏది నిజం, ఏది నిజం కాదన్నది నాకూ తెలుసు. కానీ... అధ్యక్ష స్థానంలో ఉన్నందునే దాని గురించి మాట్లాడలేకపోతున్నాను’’ అని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఏపీకి సంబంధించిన అంశాలపై తనకూ సంబంధముందని చెప్పారు.
మరో పక్క వెంకయ్య చెప్పిన మరో మాట కూడా ఆలోచించాల్సిన విషయం. "చట్టసభల్లో ఏమీ జరగవు ఏమి జరగాలన్న అది కేంద్రంతో యొక్క ఆలోచనకు అనుగుణంగానే జరుగుతాయి" అంటూ వ్యాఖ్యలు చేసారు. ఇంతకీ వెంకయ్య నాయుడు గారు ఈ విషయాన్ని ఎంత స్పష్టంగా చెప్పటంలో అర్థం ఏమై ఉంటది? మోడీ షాల కింద ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యం మీద చట్టసభల మీద పార్లమెం టు మీద ఇటువంటి భావన కలిగి ఉంది అన్ని యావత్ దేశానికి తెలియజేశారు. ఇది ఒక ప్రమాదం సంకేతం. మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా వెంకయ్య ఒకానొక దశలో భావోద్వేగంతో స్పందించారు. తమకు మరింత సమయం కేటాయించాలని వైసీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి వెల్‌లోకి వచ్చి గట్టిగా డిమాండ్ చేశారు. టీడీపీ, టీఆర్‌ఎ్‌సకు ఎక్కువ సమయం ఇచ్చి... తమకు ఇవ్వలేదని... వెంకయ్య పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారని విజయ సాయిరెడ్డి గట్టిగా అన్నారు.
అయితే... సభ్యుల సంఖ్యను బట్టి సమయం ఇచ్చామని, అలా కేటాయించిన దానికంటే ఎక్కువగానే మాట్లాడించానని వెంకయ్య చెప్పారు. సభ నుంచి వాకౌట్ చేస్తామంటూ విజయసాయి రెడ్డి ఇంకా ఏవో వ్యాఖ్యలు చేశారు. దీనిపై వెంకయ్య తీవ్రంగా స్పందించారు. ‘ఇలా బ్లాక్‌మెయిల్ చేస్తామంటే కుదరదు’ అని తేల్చి చెప్పారు. ఇదే క్రమంలో రాజ్యసభలో అప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసునని అన్నారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై పలుపార్టీల నేతలు విమర్శలు వ్యక్తం కావడంతో... ఆయన వెంకయ్యను కలిసి క్షమాపణ చెప్పినట్లు రాజ్యసభ వర్గాలు తెలిపాయి.