సుజనా చౌదరి.. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు... కేంద్ర మంత్రిగా కూడా పని చేసారు... చంద్రబాబు ఆదేశాల ప్రకారం, రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా రాజీనామా చేసారు... అయితే, గత కొన్ని రోజులుగా వైసిపీ, బీజేపీ, జనసేన కలిసి, సుజనా చౌదారి పార్టీ మారుతున్నాడు అని, చంద్రబాబు పై నమ్మకం లేక, బీజేపీ పార్టీలో చేరుతున్నారని, ప్రచారం మొదలు పెట్టారు... కొన్ని వార్తా చానల్స్ అయితే, స్పెషల్ ప్రోగ్రామ్ లు కూడా వేసాయి... గతంలో ఎన్నో సార్లు, సుజానా ఈ పుకార్లు ఖండించినా, ఇలాంటి ప్రచారం చేస్తూనే ఉన్నారు... మోడీకి భయపడిపోయి సుజనా పార్టీ మారుతున్నాడు అనే వారు, ఈ రోజు రాజ్యసభలో జరిగింది చూస్తే మరోసారి ఇలా మాట్లడరేమో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం అమలు, ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కాగానే ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఈ అంశంపై చర్చకు అనుమతించారు. చర్చకు మొత్తం 2.30 గంటల సమయాన్ని కేటాయించినట్లు చెప్పారు. చర్చను మొదటగా తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి ప్రారంభించారు. కేంద్రం వైఖరి వల్ల, మోడీ వైఖరితో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంధకారమయిందని సుజనాచౌదరి ఆరోపించారు. విభజన హామీలు, ప్రత్యేక హోదాపై రాజ్యసభలో సుజనా చర్చను ప్రారంభించిన ఆయన మోదీపై నిప్పులు చెరిగారు.! రాజ్యసభలో మాజీ ప్రధాని ఇచ్చిన హామీలను కేంద్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ విషయంలో కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. మూకదాడుల తరహాలోనే ఏపీపై కేంద్రం వ్యవహరిస్తోందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. అలాగే విభజన చట్టాన్ని సవరించడంలో కూడా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని గుంటూరు, నెల్లూరు, తిరుపతి సభలో మోదీ చెప్పలేదా? అని సుజనా నిలదీశారు. మంత్రి వర్గ నిర్ణయాలు రాజ్యంగబద్ధమైనవని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ మంత్రివర్గ నిర్ణయాలను ఇప్పటి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడంలేదని వాపోయారు. రూ. 16వేల కోట్లతో రాష్ట్రం విడిపోయిందని, రెవెన్యూ లోటు రూ. 4వేల కోట్లు అని పీఎంవోనే చెప్పిందని గుర్తుచేశారు.
తామడుగుతున్నది కేవలం ఏపీకి రావాల్సింది మాత్రమే అడుగుతున్నామన్నారు. కానీ కేంద్రం మాత్రం ఏపీని అన్ని విధాలా అవమానించిందని వాపోయారు. ఏపీ విషయంలో కేంద్రం అసత్య ప్రచారం చేస్తోందని సుజనాచౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రివర్గ నిర్ణయాలు రాజ్యంగబద్ధమైనవని.. మోడీ వాటినే తుంగలో తొక్కిందని విమర్శించారు. ఈ చర్చలో తెదేపా తరఫున గరికపాటి మోహన్రావు, సీఎం రమేశ్, రవీంద్రకుమార్, టీజీ వెంకటేశ్, తోట సీతారామలక్ష్మి, కాంగ్రెస్ తరఫున కేవీపీ రామచందర్రావు, భాజపా తరఫున జీవీఎల్ నరసింహారావు, వైకాపా తరఫున విజయసాయిరెడ్డి చర్చలో పాలొననున్నారు. చర్చ సందర్భంగా తమకు మద్దతు ఇవ్వాలని వివిధ పార్టీల నేతలను తెదేపా ఎంపీలు కోరారు.