ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను అమలు చేయాలని టీఎంసీ ఎంపీ ఒబ్రియాన్ డిమాండ్ చేశారు. బీజేపీతో స్నేహంగా ఉన్న సమయంలో ఒక రకంగా, స్నేహం విడిపోయినప్పుడు మరో రకంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హమీ చట్టంఅమలుపై మంగళవారం నాడు రాజ్యసభలో నిర్వహించిన చర్చలో ఆయన పాల్గొన్నారు. అభివృద్ధి విషయంలో ఎందుకు వివక్షను చూపుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. ఏపీ హక్కులపై చర్చ దేశానికి కూడా ఎంతో అవసరమని అన్నారు. ఒకప్పుడు ఎన్డీయేకు రెండో అతి పెద్ద భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం ఇప్పుడు అవిశ్వాసం పెట్టే పరిస్థితికి వచ్చింది. దశాబ్దాలుగా బీజేపీతో కలిసి ఉన్న శివసేన ఇప్పుడు ఎలా వ్యవహరిస్తోందో మనం చూస్తున్నాం అని ఆయన అన్నారు.

tmc 24072018 2

బీజేపీ నాయకత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా సుదీర్ఘ కాలంగా మిత్రులుగా ఉన్న వారంతా కూడ బీజేపీకి దూరమౌతున్నారని చెప్పారు. 29 ఏళ్ల స్నేహన్ని కూడ శివసేన వదులుకొందని చెప్పారు. మరోవైపు 1500 రోజుల మిత్రత్వాన్ని కూడ టీడీపీ వదులుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలుగు బిడ్డ అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. ఢిల్లీలో జీవీఎల్ కు ఆధార్ కార్డు ఉంది, ఆయన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. తాను ఏపీలో పుట్టానని చెప్పుకొంటాడని ఒడ్రియన్ జీవీఎల్ నరసింహరావుపై వ్యాఖ్యలు చేశారు.

tmc 24072018 3

ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు మాట్లాడిన అన్నాడిఎంకె ఎంపీ నవనీత కృష్ణ కూడ కేంద్రం తమిళనాడు రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇదిలా ఉంటే బీజేడీ ఎంపీ కూడ ఏపీ రాష్ట్ర హక్కుల కోసం తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తమ రాష్ట్రానికి కూడ ప్రత్యేక హోదాను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read