రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల రాజకీయం రోజు రోజుకీ దిగాజారి పోతుంది. ఒకాయిన నాకు ఎవరో చెప్పారు, వాళ్ళెవరో అనుకుంటున్నారు అని ఆరోపణలు చేస్తాడు... ఇంకో ఆయన, నీలు ఇన్ని పెళ్ళిళ్ళు, నువ్వా నాకు చెప్పేది అని వ్యక్తిగత విమర్శలు చేస్తాడు... కాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం, అటు ఢిల్లీతో పోరాటం, ఇటు అభివృద్ధి, పరిపాలాన, కుట్రలు, ఇలా అన్ని ఎదుర్కుంటూ, ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయో లేదో చూస్తున్నారు. ఈ రోజు, విద్యాధరపురంలో, అనిల్ కుంబ్లే సహా, వివిధ ప్రముఖ క్రీడాకారుల సమక్షంలో, ప్రాజెక్ట్ గాండీవ ప్రారంభమయింది. ఆ కార్యక్రమం పూర్తయిన తరువాత, చంద్రబాబు నేరుగా ఇంటికి వెళ్లి పడుకోలేదు.. పేదల దగ్గరకు వెళ్లారు. నిరు పేదలు వారు..
విజయవాడలోని విద్యాధరపురంలో అంతర్జాతీయ క్రీడాప్రాంగణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఉండవల్లిలోని నివాసానికి తిరుగు ప్రయాణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 11న భవానీపురంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు పలు సూచనలు చేశారు. అన్నక్యాంటీన్ కు మూడు వైపులా ఉన్న ఖాళీ ప్రదేశాన్ని అందంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావారణాన్ని కలిగించాలని అధికారులకు సూచించారు.
పనులు ఆలస్యం చేయకుండా త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు చెప్పారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్ తీరుతెన్నులపై పలువురి అభిప్రాయాలు తెలుసుకున్నారు. స్థానికులను కలిసి మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉండవల్లిలోని తన నివాసానికి ముఖ్యమంత్రి పయనమయ్యారు. ఇలా రాష్ట్రం పట్ల, పేద ప్రజల పట్ల నిత్యం అప్రమత్తతతో చంద్రబాబు పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు చెయ్యాల్సిన పని కూడా తానే చేస్తూ, అందరికీ ఆన్నీ సమకూర్చుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నారు. మన ప్రతిపక్షం ఒకరి మీద ఒకరు, వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ, పబ్బం గడుపుతున్నారు.