మన సమస్యల పై, గత వారం అవిశ్వాస తీర్మానంలో, మన రాష్ట్ర సమస్యల గురించి చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, అవిశ్వాస తీర్మానంలో ప్రధాని చెప్పిన అబద్ధాలు, సభను తప్పుదోవ పట్టించటం ఫై, తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి పై సభా హక్కుల ఉల్లంఘన ఇవ్వనున్నారు. చంద్రబాబు సూచనల మేరకు, మోడీ సభను తప్పుదోవ పట్టించారని, నోటీస్ ఇవ్వమని చంద్రబాబు సూచించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ఏపి డిమాండ్ పై, ప్రధాని మోడీ అబద్ధాలు చెప్పారని, అందుకే నోటీస్ ఇవ్వమని చంద్రబాబు, ఎంపీలను ఆదేశించారు.
మార్చి నెలలో, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించాలన్న డిమాండ్ ను పక్కన పడేయటం, మిగతా విభజన హామీలు గాలికి వదిలివేయటంతో, టిడిపి ఎన్డిఎ నుండి వైదొలిగింది. మొన్న జరిగిన అవిశ్వాస తీర్మాన చర్చకు సమాధానం ఇస్తూ, 14 వ ఆర్థిక కమిషన్ సూచనలు మేరకే ఆంధ్రకు ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించలేక పోతున్నామని ప్రధాని పేర్కొన్నారు. దీని పై తెలుగుదేశం పార్టీ మండిపడుతుంది. ఇది అబద్ధమని, ఎక్కడా 14 వ ఆర్థిక కమిషన్ ప్రత్యెక హోదా ఇవ్వద్దు అని చెప్పలేదని, మోడీ తప్పుదోవ పట్టించారని అంటుంది.
నిన్న రాజ్యసభలో కూడా, పియూష్ గోయల్ ఇదే విషయం చెప్పారు. అయితే సియం రమేష్ ఘాటుగా స్పందించారు. అది ఎక్కడ ఉందో చూపిస్తే, నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా అన్నారు. మోడీ, పియూష్ ఇద్దరూ అబద్ధాలు చెప్పారని, ఇద్దరి పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వమని చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పై, రాఫేల్ ఒప్పందంపై, సభను తప్పుదోవ పట్టించారని, కాంగ్రెస్ ఒక నోటీసు ఇచ్చింది.