33 వేలు ఎకరాలు మన కలల రాజధాని కోసం త్యాగం చేసారు ఆ రైతులు... వారికి అన్ని విధాలుగా అండగా ఉండాల్సింది పోయి, వారి సమస్యలు ప్రభుత్వంతో పోరాడాల్సింది పోయి, మన రాష్ట్రంలో అసుర జాతి, వారికి అడుగడుగునా అడ్డం పడ్డారు... వారికి భవిష్యత్తు మీద నమ్మకం లేకుండా చేస్తున్నారు... వారికి మానిసిక ప్రశాంతత లేకుండా, రాక్షస పత్రికలు, టీవీల్లో సైకో కధనాలు వేస్తూ, సాడిస్ట్ లు లాగా ఆనందం పొందారు... ఇంత చేసినా వారు కేవలం ఒకే ఒక్క వ్యక్తిని నమ్మారు... ఆయనే మన ముఖ్యమంత్రి.... ఒక్క ఆందోళన లేకుండా 33 వేలు ఎకరాలు ఆయన చేతిలో పెట్టారు... ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగలేదు... అది ఒక నాయకుడు మీద, ప్రజలకు ఉన్న నమ్మకం... అందుకే ఈ అసుర జాతి రూట్ మార్చింది... రైతులని రెచ్చగొట్టి ఏమి చెయ్యలేమని, చంద్రబాబుని ఇబ్బంది పెట్టలేమని అలోచించి, అమరావతిని ఆపాలి అంటూ కేసులు వెయ్యటం మొదలు పెట్టింది.

amaravati 21072018 2

అమరావతిని రాబందులు పీక్కుటినట్టు, పీక్కుతింటానికి వస్తుంటే, చంద్రబాబు వీరి బారి నుంచి, అమరావతిని కాపాడుతూ వస్తున్నారు. ఇప్పటికే, అమరావతిలో జగన్ చేసిన అరాచకం తెలిసిందే. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఎన్ని సార్లు కేసులు వేసారో, అమరావతిని ఆపటానికి ఎన్ని సార్లు ప్రయత్నించారో చూసాం. అయితే, అమరావతి నిర్మాణానికి ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది... పర్యవనానని ఎటువంటి ఆటంకం కాకుండా, నిర్మాణాలు చేసుకోమని తీర్పు ఇచ్చింది... అయితే, ఇప్పుడు జనసేన పార్టీ రంగంలోకి దిగింది. పర్యావరణ అనుమతుల పై, రివ్యూ చెయ్యాలి అంటూ, జనసేన పార్టీకి చెందిన బొలిశెట్టి సత్యం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటీషన్ దాఖలు చేసారు.

amaravati 21072018 3

అయితే, వీరి పప్పులు ఉడకలేదు. పర్యావరణ అనుమతులపై ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎస్జీటీ) కొట్టేసింది. దాంతోపాటు దాఖలైన మరో వ్యాజ్యాన్ని కూడా ధర్మాస నం తోసిపుచ్చింది. ఎన్జీటీ తీర్పు ఇచ్చిన సమయంలో 5 అంశాలను పరిగణనలోకి తీసుకొలేద ంటూ ఈఏఎస్‌ శర్మ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను, తీర్పు తర్వాత మరికొన్ని అభ్యంతరాలు కొత్తగా వెలుగులోకి వచ్చాయంటూ జనసేన పార్టీకి చెందిన బొలిశెట్టి సత్యం దాఖలు చేసిన పిటిషన్‌ను కలిపి జస్టిస్‌ ఆదర్శకుమార్‌ గోయల్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారించింది. అమరావతిని ఆపే ఆంధ్రా ద్రోహులు, ఇంకో ప్లాన్ తో ముందుకు రండి... మీరు ఏమి చేసినా, మా అమరావతిని ఆపలేరు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read