పురందేశ్వరి పై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక ఫైర్ అయ్యారు. ఆమెకు పది ప్రశ్నలు సంధించారు. "పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైఖరి పట్ల యావత్‌ దేశమంతటా విమర్శలు ఎక్కుపెడుతుంటే రాష్ట్ర బీజేపీ నాయకులు పురందేశ్వరి మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శంచడం సమంజసం కాదు. తెలుగువారు ఎప్పటికీ గౌరవించే ఎన్టీఆర్‌ కుమార్తెగా.. తెలుగువారికి అన్యాయం జరుగుతుంటే కనీసం మాట్లాడకపోవటం ఏంటి.? కేంద్ర ప్రభుత్వం అపరిచితుడిలా వ్యవహరిస్తుంటే.. అంతకన్నా ఏమిస్తారని పురందేశ్వరి పేర్కొనటం సరికాదు. రాష్ట్ర ప్రజల నుంచి కేంద్రం వసూలు చేసిన సొమ్ములో 40శాతం ఇస్తూ.. ఏదో దారాదత్తం చేస్తున్నట్లు వ్యాఖ్యానించటం సరికాదు. కేంద్రం ఇతర రాష్ట్రాలతో సమానంగా నిధులు ఇచ్చింది తప్పా ప్రత్యేకంగా ఒక్క రూపాయి అదనంగా ఇవ్వలేదు. పార్లమెంట్‌లోనే కేంద్ర హోం శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాష్ట్రానికి ఇప్పటి వరకు దాదాపు రూ. 13వేల కోట్లు మాత్రమే ఇచ్చామని చెప్పారు. సుప్రీంకోర్టులో అఫడవిట్‌, అవిశ్వాస తీర్మానంలోని ఒకటే చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రాన్ని విమర్శించకుండా కేవలం రాజకీయ లబ్దికోసం పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారు."

puran 21072018 2

"పురందేశ్వరికి పది ప్రశ్నలు... 1. గతంలో విశాఖ నుంచి గెలిచి మంత్రిగా అయి ఉత్తరాంధ్ర చిరకాల వాంఛైనా విశాఖ రైల్వేజోన్‌ను ఎందుకు సాధించలేకపోయారు? రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే సభలో ఉండి ఏం చేశారు?... 2. తెలుగు ప్రజలకు అండగా ఉండాల్సిన వారు కేంద్రానికి వత్తాసు పలకటం వెనుక ఆంతర్యమేంటి.?... 3. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదని, కాఫర్‌ డ్యాం అవసరం లేదని అసంబద్దమైన వ్యాఖ్యలు చేయటం మీకు తగునా.?... 4. రాష్ట్రానికి అడుగుతున్న నిధులు రాష్ట్రం చెల్లించిన పన్నులు కాదా.?... 5 జనసేన ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీలో మేధావులు, రాజకీయనేతలు రాష్ట్రానికి రూ.75వేల కోట్లు రావాలని పేర్కొన్నారు. దీనిపై ఎందుకు స్పందించరు?"

puran 21072018 3

"6. కేంద్రం యూసీల పేరుతో మోసం చేయాలని చూస్తున్న మాట వాస్తవం కాదా.?... 7. అధికార పార్టీలో ఉంటూ.. సొంత గడ్డకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించకుండా కేంద్రం తానా అంటే తందానా అన్నట్లు వ్యవహరించటం మీకు తగునా.?... 9. ఎన్టీఆర్‌ కేంద్రాన్ని మిధ్యగా పేర్కొంటే.. మీరు కేంద్రం మిన్న అనటం ఎంత వరకు సబబు.?.. 9. కేంద్రం చేస్తున్నది మోసం అని మీకు తెలియదా.? తెలిసీ తెలియనట్లున్నారా.?... 10. రూ.350 కోట్లు వెనకబడిన జిల్లాలకు కేటాయించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో జమ చేసి తిరిగి ప్రభుత్వం అనుమతి లేకుండానే వెనక్కు తీసుకున్న కేంద్రాన్ని నిలదీయని మీరు రాష్ట్ర ప్రజల పక్షమా?... లేక మోదీ పక్షమా? : " అంటూ ముళ్లపూడి రేణుక, పురందేశ్వరిని ప్రశ్నించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read