రాష్ట్రమంతటా సంక్రాంతి పండుగ సందడి అంబరాన్నంటింది... సామాన్య ప్రజలే కాదు, రాజకీయ నాయకులు, సెలేబ్రిటీలు అందరూ పండుగ వేడుకులు జరుపుకుంటున్నట్టు వార్తల్లో చూస్తున్నాం... రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కుటుంబంతో కలిసి, సొంత ఊరు నారావారి పల్లెలో సంక్రాంతి వేడుకలు జర్పుకుంటున్నారు... నిన్న భోగి పండుగను పురస్కరించుకుని, రాష్ట్రమంతటా భోగి మంటలు వేసుకుని, పండుగ ప్రారంభించటం చూసాం... ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలి, రాష్ట్ర ప్రజలకు కాదు, సొంత పార్టీ కార్యకర్తలు, నేతలకే నచ్చ లేదు...
చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం నెన్నూరు నుంచి ఆదివారం 62వ రోజు ముఖ్యమంత్రి కుర్చీ కోసం జగన్ చేస్తున్న సంకల్ప యాత్ర మొదలైంది. ఉదయం 8.30 గంటలకు జగన్ శిబిరం నుంచి బయటకు వచ్చారు... అప్పటికే అక్కడ కొంత మంది కార్యకర్తలు గుమి గూడారు... భోగి మంటలు ఏర్పాటు చేశారు... ఆడవాళ్ళని కూడా తీసుకోవచ్చారు... జగన్ మోహన్ రెడ్డిని భోగి మంట వెలిగించమన్నారు, భోగి సంబరాల్లో పాల్గునమన్నారు... జగన్ మాత్రం సున్నితంగా తిరస్కరించి, పాదయాత్ర చేస్తూ ముందుకు కదిలారు...
ఈ పరిణామంతో, అక్కడ ఉన్న కార్యకర్తలు అవాక్కయ్యారు... ఉదయం తెలవారక ముందే ఏర్పాట్లు చేసి జగన్ కోసం వేచి చూసారు... జగన్ వ్యక్తిగత సిబ్బింది మాత్రం, ఇప్పుడే బయటకు రారు అని, కొంచెం సేపు ఆగాలని చెప్పారు... అప్పటికే తెలవారింది... అయినా అక్కడ కార్యకర్తలు ఓర్పుగా జగన్ కోసం వేచి చూసారు... జగన్ తో కలిసి భోగి మంటలు వెయ్యటానికి ఉత్సాహం చూపించారు... జగన్ మాత్రం ఉదయం 8.30 గంటలకు బయటకు వచ్చి, వేడుకల్లో పాల్గునకుండా వెళ్ళిపోయారు... ఇలాంటి వేడుకల్లో పాల్గునకుండా జగన్ ఏమి సందేశం ఇవ్వదలచుకున్నారు అంటూ, అక్కడ కార్యకర్తలు మంది పడ్డారు... ప్రజలకు చేరువయ్యే ఇలాంటి కార్యక్రమాలు కూడా దూరం ఉండటం ఏంటి అని అసహనం వ్యక్తం చేసారు... కడుపు చించుకుంటే కాలు మీద పడుతుంది అన్నట్టు, జగన్ వ్యవహార శైలి తెలిసి కూడా ఇక్కడకు రావటం మన బుద్ధి తక్కవ అని, చడి చప్పుడు చెయ్యకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయారు...