నిత్యం ఆంధ్ర రాష్ట్రం మీద విషం కక్కే వైఎస్ఆర్ పార్టీ, మళ్ళీ అదే పని చేసింది... వేదిక ఏదైనా సరే, ప్రజలకు మంచి చేసే ప్రాజెక్ట్ ల మీద పడి ఏడవటమే వీరి పని... ఈ రోజున, కృష్ణా డెల్టా రైతులు కాని, గుంటూరు, ప్రకాశంలో కొంత లెక్క రైతులు కాని సంతోషంగా ఉన్నారు అంటే, నాలుగు ముద్దలు తింటున్నారు అంటే అది పట్టిసీం చలవే... నాగార్జున సాగర్ నుంచి ఎంత నీరు వచ్చిందో, అందరికీ తెలిసు... పట్టిసీమ కనుక లేక పోయి ఉంటే, పరిస్థితి ఊహిస్తేనే భయం వేస్తుంది.. ఇంతలా రైతులని ఆదుకున్న పట్టిసీమ మీద, నిత్యం ఏడుస్తూనే ఉంటుంది వైఎస్ఆర్ పార్టీ...

jagan 24012018 2

ఇప్పటికీ పట్టిసీమ దండుగ అంటాడు జగన్... తాజాగా అమరావతి అసెంబ్లీలో జరిగిన పీఏసీ సమావేశంలో కూడా ఇదే రకమైన కడుపు మంట పట్టిసీమ మీద చుపించిది, వైసీపీ... పట్టి సీమ మీద వారికి ఎంత కడుపుమంటో మరో సారి అసెంబ్లీ సాక్షి గా బయట పెట్టాడు వైసీపీ నేత, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి... కృష్ణ, గోదావరి డెల్టా రైతుల కోసం పట్టిసీమ ద్వారా ఇంత ఖర్చు అవసరమా? అని ప్రశ్నించాడు... ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు... ఈ పట్టిసీమ అసలు ఎందుకు కట్టారో చెప్పండి అంటూ, హడావిడి చేసారు...

jagan 24012018 3

రైతులు పచ్చగా ఉంటే అసలు ఓర్వ్ లేరు ఈ జగన్ రెడ్డి బ్యాచ్... డెల్టా రైతుల కోసం ఇంత ఖర్చు అవసరమా అన్నాడు ఆంటే అసలు అతను మనిషేనా ? రాజేంద్ర గారు ఆ రైతులు పండించినదే మీరు మీ నాయకుడు తింటున్నది.. అయ్యా రాజేంద్ర ఆ ఖర్చు కేవలం డెల్టా రైతుల కోసమే పెట్టలేదు, దానివల్ల ఆదా అయిన నీటిని రాయలసీమ జిల్లాకే తరలించారు.... షుమారు 150 టియంసి నీరు సీమ రైతాంగంకి ఇచ్చారు.... కళ కళ లాడుతున్న చెరువు లు కుంటలు పచ్చని పొలాలు (మీ నాయకుడి పాదయాత్ర వెంబడి పొలాలను చుడండి ) సాక్ష్యం గా నిలుస్తున్నాయి.... కళ్ళు ఉండి కబోదిలా వ్యవహరించ వద్దు... పట్టిసీమ కు పెట్టిన ఖర్చు డెల్టా వారికే కాదు, సీమ రైతాంగాని కి కూడా... గాలేరు నగరి , హంద్రీ నీవా, తెలుగు గంగకు కూడా పట్టిసీమ ఆధారంగా మారింది... మూడేళ్ళు అయినా, మీకు ఇప్పటికీ పట్టిసీమ అంటే ఏంటో తెలియకపోవటం, మా రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read