సొంత రాష్ట్రాల్లో రాజకీయంగా, రెండు రాష్ట్రాల్లో పోటీలు ఎలా ఉన్నా, విదేశీ గడ్డ పై మాత్రం, తెలుగు వారు అంతా ఒకటే అనే ఫీల్ కనిపించింది దావోస్ లో... స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ సదస్సులో పాల్గునటానికి, ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎంపీ గల్లా జయదేవ్ వెళ్లారు... అలాగే తెలంగాణా నుంచి, మంత్రి కేటీఆర్ వచ్చారు.. ఈ సందర్భంగా దావోస్ లో జరిగిన ఆరంభ వేడుకల్లో, ఇరు తెలుగు రాష్ట్రాల నేతలు కలుసుకున్నారు... ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు కావటంతో, కేటీఆర్, లోకేష్ ను చూసి బర్త్ డే విషెస్ చెప్పారు...
లోకేష్ కూడా, సాదరంగా కేటీఆర్ ను రిసీవ్ చేసుకున్నారు.. తరువాత కేటీఆర్, చంద్రబాబు దగ్గరకు వెళ్లి, కొంచెం సేపు మాట్లాడారు... తరువాత చంద్రబాబుతో కలిసి ఫోటో దిగారు.. అక్కడే ఉన్న గల్లా జయదేవ్ తో కూడా, కేటీఆర్ ఫోటోలు దిగారు... ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి... ఇరు రాష్ట్రాల నేతలు, అన్నీ పక్కన పెట్టి, విదేశీ గడ్డ పై, కలిసి ఉండటం చూసి, ఇరు రాష్ట్రల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు...
ఇటీవలె కేసిఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ ని, ఆంధ్రా పాలకులు ద్వంసం చేసారు అని, రకరకాలుగా మాట్లాడారు... దీనికి చంద్రబాబు, కూడా స్పందిస్తూ, అది తప్పు అని, హైదరాబాద్ అభివృద్ధి ఎవరు చేసారో అందరికీ తెలుసు అని అన్నారు.. అంతకు ముందు ఒక సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ డెవలప్ అయ్యింది అంటే, అది చంద్రబాబు పుణ్యమే అని అన్నారు... హైదరాబాద్ లో ఐటి ఉంది అంటే, అది చంద్రబాబు వేసిన పునాదులే అని, అది అందరూ అంగీకరించి తీరాలి అని చెప్పారు...