సర్ప్రైజ్ అంటే ఏంటో అనుకోకండి... మొన్నటి వరకు అన్ని రాష్ట్రాలు మెచ్చుకుంది... నిన్న రాష్ట్రపతి మెచ్చుకుంది... ఈ రోజు దావోస్ లో అంతర్జాతీయ ఖ్యాతి పొందుతున్న మన రాష్ట్ర రియల్ టైం గవర్నెన్స్ గురించి, మొదటి సారి ప్రధాని, ఈ అద్భుతం చూడనున్నారు... అవును ఇది అద్భుతమే... దేశ రాష్ట్రపతిని సైతం ఆశ్చర్యపరిచిన ప్రాజెక్ట్ ఇది... ఇప్పుడు దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో రియల్ టైం గవర్నెన్స్ విధానాన్ని ప్రదర్శించనున్నారు. రాష్ట్రపతి నుంచి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడి వరకు అమరావతికి వచ్చిన వారంతా ఇక్కడి ఆర్టీజీ కేంద్రం, రియల్ టైం పాలన అద్భుతమని కొనియాడారు. ఇప్పుడీ అద్భుతాన్ని ప్రపంచానికి కూడా చాటి చెప్పనున్నారు...
ప్రధాని కూడా దావోస్ లో ఉన్నారు... ఈ రోజు దాదాపు రెండు గంటల పాటు, దావోస్ లో ఏర్పాటు చేసిన ఏపి లాంజ్ లో, ప్రధాని మోడీ గడపనున్నారు... ఈ సందర్భంగా, ప్రధాని మోడీకి రియల్ టైం గవర్నెన్స్ విధానాన్ని చూపించి, అది ఎలా పని చేస్తుంది, రియల్ టైంలో పాలన ఎలా చేస్తుంది, చంద్రబాబు మోడీకి వివరించనున్నారు... ఈ రియల్ టైం గవర్నెన్స్ పని తనాన్ని, ప్రపంచానికి కూడా చాటి ఉద్దేశంతో, దావోస్ లో ఏపి లాంజ్ లో ఇది ఏర్పాటు చేసారు... సచివాలయంలోని ఆర్టీజీ కేంద్రంలో ఉన్నట్లుగానే అక్కడా వీడియో వాల్ ఏర్పాటు చేసారు...
ఇప్పటికే రియల్ టైం గవర్నెన్స్(ఆర్టీజీ) ప్రాజెక్టుకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఇప్పటికే, ఈ నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో నీతి ఆయోగ్ ఒప్పందం కుదుర్చుకోనుంది. దేశంలో అత్యంత వెనుకబడిన 115 జిల్లాల అభివృద్ధికి తాము అమలు చేస్తున్న పథకాల ఫలితాలను ఇదే తరహాలో సమీక్షించాలని నీతి ఆయోగ్ భావిస్తోంది. దీనికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఆర్టీజీ ద్వారా పొందాలని ఆ సంస్థ భావిస్తోంది.