దాణా స్కామ్ కేసులో ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను దోషిగా రాంచిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ రోజు ప్రకటించింది. లాలూ దాణా స్కామ్ కు సంబంధించి దోషిగా తేలడం ఇది మూడో కేసు. మరో రెండు కేసుల్లోనూ ఆయన ఇప్పటికే దోషిగా నిరూపితం అవడమే కాకుండా, కోర్టు శిక్షలు ఖరారు చేసింది... మరో మూడు కేసులు విచారణలో ఉన్నాయి... వాటిల్లో కూడా, లాలూ దోషిగానే తేలతాడు... ఇక మిగిలిన జీవితం అంతా జైలులోనే... ఈ తీర్పుతో జగన్ బ్యాచ్ హడలి పోతుంది.. ఎందుకంటే, జగన్ కేసులు కూడా ఇంతే... 11 కేసులు... ప్రతి కేసు వేరు.. ప్రతి దానికి శిక్ష వేరు...
జగన్ కేసులో, నిందితులు తప్పించుకుంటారు అని తెలిసి, అప్పటి సిబిఐ జేడీ లక్ష్మీ నారాయణ జగన్ పై పక్కగా కేసులు పెట్టారు... పక్కా ఆధారాలు పెట్టారు... ఎంత ఒత్తిడి ఉన్నా, కేసు తీర్పు డిలే చెయ్యవచ్చు ఏమో కాని, జగన్ అవినీతి రుజువు చెయ్యటం మాత్రం పక్కా.... అందుకే జగన్ పై, దాదాపు 11 ఛార్జ్ షీట్లు వేశారు.... ప్రతి ఛార్జ్ షీట్ ఒక కేసుగా పరిగనిస్తారు... అన్నిట్లో సాక్షాలు పక్కగా ఉన్నాయి... ఎదో ఒక్క కేసులో తప్పించుకున్నా, 11 కేసుల్లోనూ తప్పించుకోవటం అసంభవం... ఇవన్నీ తెలిసే జగన్ జాగ్రత్త పడుతున్నాడు...
అన్ని కేసులు కలిపి, ఒకే కేసుగా పరిగనించమని అనేక సార్లు కోర్ట్ కి విన్నవించుకున్నా, ఫలితం లేదు... అందుకే ప్రొసీడింగ్స్ డిలే చెయ్యటానికి ఏవేవో పిటిషన్స్ వేసి ఆలస్యం చేస్తున్నారు. ప్రస్తుతం డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. ఇవి కూడా రెండు మూడు వాయిదాల్లో కొట్టేసే అవకాశాలు ఎక్కువ...డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టేస్తే మనోళ్లు అయిపోయినట్టే.. చార్జెస్ మొదలుపెడతారు... కేసులు కొలిక్కి వస్తాయి... అన్నిట్లో శిక్షలు పడతాయి... ఎంత మ్యానేజ్ చేసినా, ఏదో ఒకదాన్లో శిక్ష తప్పనిసరి.... ఇలాంటి ట్రిక్ లు వాడతారు అని తెలిసే, ఇంత అవినీతి చేసినవాడు తప్పించుకోకూడదు అని, అప్పటి సిబిఐ జేడీ లక్ష్మీ నారాయణ పక్కగా సెట్ చేసే పెట్టారు... ఎవ్వరు, ఏ స్థాయిలో జగన్ ను కాపాడటానికి చూసినా, అవి మహా అయితే కేసు డిలే చేసేదాకే కాని, కేసు నుంచి బయట పడైలేరు... ఏ రోజుకు అయినా జగన్ కు శిక్ష పడటం అనేది మాత్రం పక్కా... ఇంత చేసాడు కాబట్టే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి లక్ష్మీనారయాణ అంటే కష్టం, ఒక బ్యాచ్ కి మాత్రం లక్ష్మీనారయాణ అంటే ఎక్కడ లేని ద్వేషం...