ఆంధ్రప్రదేశ్‌కు 974 కి.మీ సముద్రతీరం ఉందని, కృష్ణా-గోదావరి బేసిన్ లో అపార చమురు నిక్షేపాలు ఉన్నాయని, పెట్రోలియం శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు దేశంలో తమ రాష్ట్రం ఎంతో అనుకూలమని సౌదీ ఆర్మ్‌కో సంస్థకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు. దావోస్ పర్యటనలో రెండో రోజు పర్యటనలో మంగళవారం ముఖ్యమంత్రి సౌదీ ఆర్మ్‌కో (Saudi Armco) ప్రెసిడెంట్ సైద్ అల్ హద్రమీతో భేటీ అయ్యారు. తమ రాష్ట్రాన్ని తాకుతూ రెండు పారిశ్రామిక కారిడార్లున్నాయని, కృష్ణ పట్నాన్ని లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దుతామని, రిఫైనరీ ఏర్పాటు వాణిజ్యపరంగా ఎంతో లాభసాటి అవుతుందని, స్వదేశంలో కా మార్కెటింగ్ కు అనువుగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

పెట్రోలియం, రసాయన పరిశ్రమల ఏర్పాటుకు, విస్తరణకు తమ రాష్ట్రంలో ఇప్పటికే సానుకూల వాతవరణం ఉందని, హెచ్.పి.సి.ఎల్, గెయిల్ కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్ ఆయువుపట్టుగా ఉందని వివరించారు. రాష్ట్రంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (IIPE), సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్& టెక్నాలజీ (CIPET) ను స్థాపించనున్నామని, ఇందువల్ల నైపుణ్యం కలిగిన మానవ వనరులు లభిస్తాయని చంద్రబాబు వివరించారు.

ఇది రాష్ట్రంలో సమీప భవిష్యత్తులో పెట్రోలియం పరిశ్రమల ఏర్పాటుకు మరింత అనువైన వాతావరణం ఏర్పడేందుకు దారితీస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయిన కంపెనీలలో సౌదీ ఆర్మ్‌కో (Saudi Armco) ఒక ప్రధాన కంపెనీ. కృష్ణ పట్నంలో రిఫైనరీ ఏర్పాటుకు ఇప్పటికే ఆసక్తి ప్రదర్శించింది. ఆ కంపెనీ ప్రతినిధులు రాష్ట్రాన్ని రెండు పర్యాయాలు సందర్శించారు. వారితో నిరంతర సంబంధాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి ఎలాగైనా సౌదీ ఆర్మ్‌కో రిఫైనరీ తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో ముంబయ్‌లో ఈ నెలాఖరులో సౌదీ ఆర్మ్‌కో (Saudi Armco) ప్రతినిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు మరోసారి కలవనున్నారు.

కాగా సౌదీ ఆర్మకో కంపెనీ మహారాష్ట్రలో $ 40 బిలియన్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడితో ఐఓసిఎల్, హె.పి.సి.ఎల్, బి.పి.సి.ఎల్ కంపెనీలతో సంయుక్త భాగస్వామ్యంలో మెగా రిఫైనరీ ఏర్పాటు చేయాలని సౌదీ ఆర్మ్ సంస్థ ప్రయత్నం చేసింది. కానీ సంయుక్త భాగస్వామ్యం కార్యాచరణకు రాలేదు. ఈ దశలొ సౌదీ ఆర్మ్ సంస్థ రిఫైనరీ ఏర్పాటుకు అన్ని అవకాశాలు, సామర్ధ్యం ఉన్న కీలక ప్రదేశంగా మన రాష్ట్రంలోని కృష్ణ పట్నాన్ని గుర్తించింది. గత ఏడాది అక్టోబర్ లో ఈ కంపెనీ భారత్ రాజధాని ఢిల్లీలో ఆర్మ్‌కో ఏషియా-ఇండియా శాఖ కార్యాలయాన్ని ప్రారంభించింది. భారత పశ్చిమ తీరంలో భారీ చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటు కు నిశ్చయించింది. భారత్‌లో మార్కెట్‌లో మరింత వాటా దక్కించుకోవటానికి ఈ సంస్థ కార్యకాలపాలు నిర్వహిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో 640 చ.కి.మీ మేర చమురు, రసాయనాలు, పెట్రెకెమికల్స్ ఇన్వె స్టిమెంట్ రీజియన్ (PCPIR) లో ఉందని, అలాగే 6 సెజ్‌లు ఉన్న విషయాలను అధ్యయనం చేసిన సంస్థ రాష్ట్రంలోని కృష్ణపట్నాన్ని తన పెట్టుబడులకు ప్రాధాన్యతా కేంద్రంగా ఎంచుకుంది. ఈ దిశగా వారిని ఒప్పించి మన రాష్ట్రానికి భారీ రిఫైనరీ తీసుకురావాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సంస్థ ప్రతినిధులతో గతంలో ఒకసారి సమావేశమయ్యారు.

ఫిబ్రవరిలో విశాఖలో నిర్వహించనున్నసిఐఐ పెట్టుబడి దారుల సదస్సుకు హాజరు కావాలని ఆయన సౌదీ ఆర్మ్‌కో ప్రెసిడెంట్ సైద్ అల్ హద్రమీని ఆహ్వానించారు. తమ రాష్ట్రంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు శరవేగంగా చర్యలు తీసుకుంటున్నామని, వ్యాపార సానుకూల వాతావరణం ద్వారా పారిశ్రామికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ స్థిరంగా ముందుకు దూసుకువెళుతోందని వివరించారు. సౌదీ ఆర్మ్‌కో ప్రెసిడెంట్ సైద్ అల్ హద్రమీ స్పందిస్తూ ‘భారత్‌కు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు మీరు చూపిస్తున్న వ్యక్తిగత శ్రద్ధను అభినందిస్తున్నాను’ అని చెప్పారు. కాగా సౌదీ ఆర్మ్‌కో ప్రధానంగా చమురు అన్వేషణ రంగంలో అపార అనుభవం గడించిన సంస్థ. భూమిలో చమురు, సహజవాయు నిక్షేపాలు (hydro corbans) అన్వేషణ, ఉత్పత్తి, ఎల్.పి.జీ ఉత్పత్తి, చమురు శుద్ధి, చమురు పంపిణీ, క్రూడ్ ఆయిల్ మార్కెటింగ్ లో ఎంతో ప్రసిద్ధి చెందింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read