ఈ మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి, జగన్ పార్టీ, సాక్షి టీవీ/పేపర్, ఏ ఇష్యూ తీసుకున్నా, సెల్ఫ్ గోల్స్ వెయ్యటంలో వీళ్ళకి మించిన వాళ్ళు ఉండరు... సదావర్తి భూములలో 1000 కోట్ల కుంబకోణం అంటూ, హడావిడి చేసి కోర్ట్ టైం వేస్ట్ చేసి, చివరకు రాష్ట్రానికి ఒక్క పైసా కూడా రాకుండా, కోర్ట్ కి వెళ్లి, రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టారు... రాష్ట్రానికి రూపాయి రాకపోయినా పర్వాలేదు, ఆ భూములు మాత్రం అమ్మకుండా ఉండాలి అని, కోర్ట్ కి వెళ్లి, చివరకు, ఏమి చేసారో తెలుసా... తమిళనాడులోనే విషయం తేల్చుకోవాలి అంటూ, హై కోర్ట్ లో ఈ విచారణ ముసివేస్తున్నాం అని కోర్ట్ చెప్పింది... దీంతో, రాష్ట్రానికి వచ్చే నాలుగు డబ్బులు కూడా పోయి, చివరకు ఈ వైసీపీ వల్ల రాష్ట్రానికి గుండు సున్నా మిగిలింది...
సదావర్తి సత్రం భూముల వ్యవహారం తమిళనాడులోని భూపరిపాలన కమిషనర్ కార్యాలయంలో అపరిష్కృతంగా ఉన్నందున ఇక్కడ విచారణ జరపలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది... తమకు విచారణ జరిపే అధికార పరిధి ఉండదని పేర్కొంటూ విచారణను మూసివేసింది హై కోర్ట్... సదావర్తి సత్రానికి చెందిన తమిళనాడులోని 83 ఎకరాల్ని వేలంలో ఏపీ సర్కారు రూ.22.44 కోట్లకు విక్రయించడాన్ని సవాలు చేస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు వెళ్ళాడు... ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరగా మళ్లీ హైకోర్టునే విచారించాలని సుప్రీం ఆదేశాలు జారీచేసింది....
హైకోర్టులో తమిళనాడు సర్కారు అనుబంధ పిటీషన్ దాఖలు చేసి, సదావర్తి సత్రానివి అని చెబుతున్న భూములు తమకు చెందినవని వాదనలు వినిపించింది. మరోవైపు ప్రైవేటు వ్యక్తులు ఆ భూముల్లో కొంత విస్తీర్ణం తమకు చెందినవంటూ అనుబంధ పిటీషన్ వేశారు. మంగళవారం ఈ వ్యాజ్యం మరో సారి విచారణకు వచ్చింది. సదావర్తి సత్రం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తు. ఆ భూములు సత్రానికి చెందుతాయని పేర్కొంటూ తమిళనాడులోని స్థానిక న్యాయస్థానం 1924లో తీర్పు ఇచ్చిందన్నారు. తమిళనాడులోని భూపరిపాలన కమిషనర్ వద్ద, ఈ భూములకి పట్టా ఇవ్వమని అప్పీల్ దాఖలు చేశామని అది అపరిష్కృతంగా ఉందన్నారు... వాదనలు విన్న ధర్మాసనం, ఆభ్యంతరం ఉన్నవాళ్ల అక్కడే వాదనలు చెప్పుకోవాలంటూ విచారణను మూసివేసింది....