కరువు జిల్లాలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కతమైంది... ఏళ్ల తరబడి నీళ్ళు లేక నిర్జీవంగా మారిన భైరవానితిప్ప, పేరూరు డ్యామ్లు జల కళను సంతరించుకోనున్నాయి. ఆయకట్టు కృష్ణా జలాలతో పరవశించనుంది... బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ లో ఉన్నా ఇచ్చిన హామీ మేరకు పరిటాల రవి వర్ధంతి రోజున ఈ రెండు డ్యామ్లకు జీవోలు జారీ చేయించారు... 13 సంవత్సరాల తరువాత, పరిటాల రవి చివరి కొరికి తీర్చారు చంద్రబాబు.... వేలాది ఎకరాల ఆయకట్టులో మళ్లీ పచ్చదనం పరుచుకోనుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సీఎంకు మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి పరిటాల సునీత ఇంటి వద్ద కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు పంచి, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు... సకాలంలో వర్షాలు లేక, భూగర్భజలాలు అడుగంటి పోయి, పంటలు పండక నిరాశ నిసృహలతో సతమతమవుతున్న రైతన్నకు ఊరటనివ్వనుంది... 2016, ఆగష్టు 15న అనంతపురం జిల్లలో జరిగిన స్వతంత్ర వేడుకుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, పేరూరుకి కృష్ణా నీళ్ళు తీసుకువస్తామని చెప్పారు... దానికి కొనసాగింపుగా, ఈ నెల 11న ధర్మవరంలో జరిగిన జన్మభూమిలో, పరిటాల రవి కలల ప్రాజెక్ట్ గురించి, త్వరలో మంచి వార్తా వింటారని, ఈ నెల 24న మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా జీవోలు జారీ చేస్తామని ప్రకటించారు. సీఎం దావోస్ లో ఉ న్నా ఆ హామీ మేరకు రెండు జీవోలనూ బుధ వారం జారీ చేశారు.
బీటీపీకి కృష్ణా జలాలు అందించడానికి రు. 968.89 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది... ఎడారిగా మారనున్నదనుకుంటున్న రాయదుర్గం ప్రాంతం బీటీపీతో పునరుజ్జీవం పొందనుంది. ఈ జీవోతో రెండు దశాబ్దాలుగా నిర్జీవంగా ఉన్న వేదవతి-హగరి జీవనదిగా మారనుంది.. బీటీపీ కింద 23,323 ఎకరాలకు నీరందించాలని జీవోలో పొందుపరిచారు. బీటీపీ కింద గల 12వేల ఎకరాలతో పాటు అదనంగా మరో 10,323 ఎకరాల ఆయకట్టుకు నీరిందించవచ్చునని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం అనుమతులు జారీ చేశారు. మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న పేరూరు డ్యాంకు నీరించ్చేందుకు ప్రభుత్వం జీవో జారీ చేయడం పై చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 11న చంద్రబాబు ధర్మవరంలో ఇచ్చిన హామీ మేరకు మాట తప్పకుండా పరిటాల రవీంద్ర 13వ వర్షంతి రోజే జీవో జారీ చేశారన్నారు. దీంతో రవి ఆశయం నెరవేరుతుందన్నారు. రాప్తాడు నియోజకవర్గం సస్య శ్యామలమవుతుందని, ఇందుకు పరిటాల కుటుంబంతో పాటు నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పటికీ చంద్రబాబుకు రుణపడి ఉంటామన్నారు...