ఆయా రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ, ఉత్తమ సేవలు అందించిన పౌరులకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలను ప్రకటించింది... ఆంధ్రోడికి దేశంలో అత్యున్నత పౌర పురస్కారంలో, నాలుగవ స్థానంలో ఉన్న పద్మశ్రీ అవార్డు దక్కింది... ఒకే సీజన్ లో నాలుగు సూపర్ సిరీస్ లు సొంతం చేసుకున్న ఘనుడు , పుల్లెల గోపీచంద్ శిష్యుడు, ప్రముఖ బ్యాడ్ మింటన్ క్రీడాకారుడు, 25 ఏళ్ళ గుంటూరు కుర్రాడు, అర్జున అవార్డ్ గ్రహీత "కిడాంబి శ్రీకాంత్" ఇక నుండి "పద్మశ్రీ కిడాంబి శ్రీకాంత్"...

srikant 26012018 2

గుంటూరు నగరానికి చెందిన కిడాంబి శ్రీకాంత్ చిన్ననాటి నుండి షటిల్ క్రీడపై మక్కువతో స్థానిక ఎన్‌టిఆర్ స్టేడియంలో శిక్షణ పొంది, అనంతరం అంతర్జాతీయ క్రీడాకారుడిగా ఎదిగి అనేక సిరీస్ లు గెలుచుకున్నాడు... శ్రీకాంత్ కు పద్మశ్రీ వచ్చింది అని తెలుసుకుని, బృందావన గార్డెన్స్‌లోని శ్రీకాంత్ నివాసంలో ఉన్న తల్లిదండ్రులు, బంధువులు ఉద్వేగానికి లోనయ్యారు. దేశంలో ఉత్తమమైన పురస్కారం అందటంతో, కుటుంబీకుల ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది...

అయితే పద్మ పురస్కారాల విషయంలో, ఆంధ్రప్రదేశ్ కు కేవలం ఒక్క అవార్డు దక్కటం, తెలంగాణాకు అసలు ఏ అవార్డు దక్కకపొవటంతో, తెలుగు రాష్ట్రాల ప్రజలు కేంద్రం పై ఆగ్రహంగా ఉన్నారు.. ఏపీ నుంచి కూడా 25 పేర్లను అవార్డులకు నామినేట్‌ చేస్తే ఒక్కరికే పురస్కారం దక్కింది... దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న కోసం మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరును, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధూను పద్మభూషణ్‌కు ఇరు తెలుగు రాష్ట్రాలు సిఫారసు చేసాయి.. అయినా కేంద్రం పట్టించుకోలేదు... ఈ సంవత్సరం ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు ఏకంగా 9 అవార్డులు లభించాయి... ఇంకా తాము పాగా వేయాలని భావిస్తున్న తమిళనాడుకు 5, పశ్చిమ బెంగాల్ కు 5, కేరళకు 4, ఒడిశాకు 4 అవార్డులను ఇచ్చిన కేంద్రం మిగతా రాష్ట్రాలను చిన్న చూపు చూసిందన్న విమర్శలు వస్తున్నాయి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read