ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దావోస్ పర్యటన నిన్నటితో ముగిసింది... నిన్నే చంద్రబాబు బృందం, దావోస్ నుంచి బయలుదేరింది.. ఇవాళ ఉదయం 7:30 కి చంద్రబాబు గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగుతారని, 11:30 గంటలకు విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గుంటారని, అధికారులు సమాచారం ఇచ్చారు.. దీని కోసం గవర్నర్ కూడా షడ్యుల్ మార్చుకున్నారు... ప్రతి సారి, ఉదయం 7:30 కి ఆంధ్రప్రదేశ్ కి వచ్చి, 10 గంటలకు తెలంగాణా వెళ్ళే వారు.. ఈ సారి ముందు తెలంగాణా వేడుకల్లో పాల్గుని, విజయవాడ వస్తున్నారు...
ఈ నేపధ్యంలో, చంద్రబాబు రాక లేట్ అవుతుంది అనే సమాచారం అమరావతి వచ్చింది... ఆయన రిపబ్లిక్ డే వేడుకుల్లో పాల్గునే అవకాసం లేదు అని, గవర్నర్ ముఖ్య అతిధిగా, వేడుకులు పూర్తి చెయ్యాలని అధికారులు నిర్ణయించారు... వాతావరణం అనుకూలించక చంద్రబాబు ప్రయాణిస్తున్న విమానం ఆలస్యమైంది... ఉదయం 7:30 కి రావాల్సింది, మధ్యాహ్నం 3గంటలకు చంద్రబాబు బృందం గన్నవరం రానుంది... చంద్రబాబు రావటం ఆలస్యం అవుతుంది అని సమాచారం రావటంతో, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి లేకుండానే, రిపబ్లిక్ డే వేడుకులు చెయ్యటానికి సిద్ధం అయ్యారు...
నవ్యాంధ్రకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫౌరం లో చంద్రబాబు పాల్గున్న సంగతి తెలిసిందే... భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సారి ఇక్కడకు వచ్చారు... ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం నాలుగు రోజుల దావోస్ పర్యటన గురువారంతో ముగిసింది.... నాలుగు రోజుల పర్యటనలో, అనేక మంది కంపెనీలతో చర్చలు జరిగాయి.. మూడు కంపెనీలతో ఏంఓయు లు జరిగాయి...