ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు సర్వేలు జరుపుకుంటున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలు మరో మారు ప్రత్యేక హోదాను తెరపైకి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ఆధినేత ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేస్తూ ముప్పేట దాడికి నేతలు కాలు దువ్వతున్నారు. నిన్నా,మొన్నటి వరకు ప్రత్యేక హోదా పై నోరు మెదపన నేతలంతా, మళ్ళీ తమ వాణిని రాష్ట్రానికే పరిమితం చేసుకొని బాబునే టార్గెట్గా పెట్టుకొని ఆందోళనకు దిగి ఓటర్లను తమకు ఆనుకూలంగా మలచుకొనే విధంగా శతవిధాల ప్రాకులాడారు.
రాష్ట్రంలో ప్రస్తుతం, ప్రజలను కదిలించే సమస్యలు ఏమి లేవు... పలన సజావుగా సాగిపోతుంది... సంక్షేమ పధకాలతో, కింద స్థాయి వరకు దూసుకెళ్ళారు చంద్రబాబు... ఈ తరుణంలో, చంద్రబాబుని ఎదుర్కోవటానికి, ఎదో ఒక సమస్య ప్రతిపక్ష పార్టీలకు కావాలి.. అందుకే ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా ఎత్తుకుంటున్నారు... సంవత్సరం నుంచి, అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రత్యేక హోదాని మర్చిపోయాయి... ఎన్నికలు వస్తున్న తరుణంలో, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్యా మరోమారు ప్రత్యేక హోదాను వైఎస్సార్స్,కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు తెరపైకి తెచ్చి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రత్యేక హోదాను మరోమారు తెరపైకి తెచ్చారు.
వైసిపి అధినేత వైఎస్ జగన్ తాజాగా సోమవారం హోదా ఇస్తే బిజేపి పొత్తు అనడం, కాంగ్రెస్ సీనియర్ నేత కెవిపి రామచంద్రరావు సైతం హోదా పై గళం విప్పడం, కమ్యూనిస్తులు హోదా కోసం బాబు పై కసబుస్సులతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కూడా శనివారం నుంచి ఆంధ్రప్రదేశ్ పర్యటనలో, ఇదే విషయం పై ఫోకస్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది... మరో పక్క రాష్ట్రంలోని బిజేపి నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని రెచ్చగొడుతూ ఆరోపణల పరంపరను కొనసాగిస్తున్నారు. వారి వెనుక కేంద్ర పెద్దల హస్తం కూడా ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. వీళ్ళందరి టార్గెట్ చంద్రబాబు... వీరందరినీ చంద్రబాబు, ప్రజా బలంతో ఎలా ఎదుర్కుంటారో చూడాలి...