మనకు తెలిసీ ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వెబ్సైటులని జగన్ మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎలా వాడుతున్నారో చూస్తున్నాం... లోటస్ పాండ్ లో ఒక ఫేక్ బ్యాచ్ ని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం కోసం వాడటం చూసాం... అలాగే 250 కోట్లు ఇచ్చి ఒక టీంని బీహార్ నుంచి తీసుకువచ్చి, మన రాష్ట్ర పరువు తీస్తూ, జాతీయ స్థాయిలో మన పరువు తీస్తున్నాడు జగన్... ఒక పక్క జగన్ ఈ రకంగా ఫేస్బుక్ ని వాడుతుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబానాయుడు సతీమణి, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ త‌న‌య ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఫేస్బుక్ ని ఎలా వాడుతున్నారో చూడండి...

bhuvaneswari 19012018

ఎన్టీఆర్ ట్రస్టు డైరెక్టర్ గా ఉంటూ, వారు నిర్వహిస్తున్న సేవా కార్యాక్రమాల విష‌యంలో విన్నూత్నమైన నిర్ణ‌యం తీసుకున్నారు భువనేశ్వరి. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఈ నెల 18న దేశ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలని, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ లెజండరీ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే, ఈ బ్లడ్ డ్రైవ్ కోసం ఫేస్‌బుక్ స‌హాయం తీసుకున్నారు... ఈ లెజండరీ రక్తదాన శిబిరాలన కార్యక్రమాన్ని నిర్వహించటానికి 300 ఫేస్ బుక్ ఈవెంట్స్‌ను తీసుకుని ప్రమోట్ చేసారు.

bhuvaneswari 19012018

ఫేస్‌బుక్ సహకారంతో ఎవరికైనా రక్తం అవసరమైతే మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న వ్యక్తులకు సమాచారం అందించడం ద్వారా, అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా రక్తం అవసరమైతే వారికి త్వరగా అందించడానికి ఉపయోగపడుతుందని, అందుకే ఫేస్బుక్ సహాయంతో సేవలు అందిస్తామని భువనేశ్వరి మీడియాతో అన్నారు.ఫేస్ బుక్ ద్వారా ఇప్పటి వరకు సుమారు 40 లక్షల మంది బ్లడ్ డోనర్స్‌గా ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకులో పేరు నమోదు చేసుకున్నారని చెప్పారు... ఫేస్బుక్ ని చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ఇలా ప్రాణాలు కాపాడటానికి వాడుతుంటే, జగన్ లాంటి వాళ్ళు మాత్రం జాతీయ స్థాయిలో, రాష్ట్ర పరువు తియ్యటానికి వాడుతున్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read