ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన సర్వే వివరాలు రెండు రోజుల పాటు జరిగిన కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్ లో బయట పెట్టారు... రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాల్లో చంద్రన్న భీమా ప్రధమ స్థానాన్ని సాధించింది. అదే విధంగా రెండో స్థానంలో మహిళా శిశుసంక్షేమ పథకాలు, మూడవ స్థానంలో పెన్షన్ల పథకం నిలిచింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు పథకాల పై ప్రజల నుండి, లబ్దిదారుల నుండి నిర్వహించిన అభిప్రాయ సేకరణలో 3 పథకాలు మొదటి 3 స్థానాల్లో నిలవడం విశేషం... కాగా వివిధ అంశాల పై కూడా రాష్ట్ర ప్రభుత్వం సర్వేను నిర్వహించడం జరిగింది.
చంద్రన్న బీమా ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు పెద్ద భరోసా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కేవలం రూ.15 చెల్లించి కార్మికుడు దరఖాస్తు చేసుకుంటే రూ. ఐదు లక్షల భరోసా లభిస్తుంది. పని స్థలంలో లేక ఇతరత్రా ఎక్కడైనా ఏదైనా ప్రమాదంలో కార్మికుడు మరణిస్తే కుటుంబ సభ్యులకు రూ.ఐదు లక్షలు అందిస్తున్నారు. పూర్తిగా అంగవైకల్యానికి గురైనా, సాధారణంగా మృతి చెందినా భీమా ఇస్తున్నారు. అసహజ, సహజ మృతికి సంబంధించిన అన్ని కేసుల్లో కుటుంబంలోని ఇద్దరు పిల్లలకు తొమ్మిదో తరగతి నుంచి ఐటీఐ లేదా తత్సమాన విద్యాభ్యాసానికి ఏటా రూ.1,250 నుంచి రూ.2,500 వరకూ ఉపకార వేతనం అందిస్తారు.
అలాగే మహిళా శిశుసంక్షేమ పధకాలుకు వస్తే, గర్భిణులకు తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్, ఉచిత రోగ నిర్ధరణ పరీక్షలు, పేద మహిళల అభ్యున్నతికి స్త్రీ నిధి పధకం, ప్రతి ఆడపిల్ల చదువుకోవాలన్న లక్ష్యంతో, ‘బడికొస్తా’, శిశువులకు రక్షణగా... "ఎన్టీఆర్ బేబి కిట్స్"., బాలింతలకు బసవతారకం కిట్ పధకం లాంటివి ఉన్నాయి... అలాగే దాదాపు 45 లక్షల మంది వృద్ధులు, వికలాంగులకు, ఒకటో తారీఖునే పింఛను ఇచ్చి, ఈ సమాజంలో మేమేమి తక్కువ కాదు, అని ఆత్మగౌరవంతో బ్రతికేలా చేస్తున్నారు... వారి కనీస అవసరాలకి వీలుగా, వారికీ తోడుగా చంద్రబాబు ప్రతి నెలా పెన్షన్ లు అందిస్తున్నారు.. ఇప్పుడు ఈ పధకాలకు ప్రజల ఆమోదం కూడా లభించటం సంతోషకరం...