2014లో నరేంద్ర మోదీ సారథ్యంలో ఏర్పాటైన ఎన్‌డిఎ ప్రభుత్వం, అప్పటి వరకు ఉన్న ప్రణాళికా సంఘన్ని ఎత్తేసి, నీతి ఆయోగ్ ని ఏర్పాటు చేసింది. NITI అంటే(National Institution for Transforming India... నీతి ఆయోగ్ కు ప్రధాన మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు.. ప్రణాళిక తయారీలో రాష్ట్ర ప్రభుత్వాలకు విధాన నిర్ణయాలకు అవసరమైన సలహాలను, సహకారాన్ని అందించడం, కేంద్ర నిధులు ఖర్చు, రాష్ట్ర ఆర్ధిక స్థితి మెరుగుపరచటం, నీతి ఆయోగ్ లక్ష్యాలు... ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలి అని చెప్పింది కూడా ఈ నీతి ఆయోగే...
కేంద్రం మాట్లాడితే నీతి ఆయోగ్ ఆమోదించాలి అని, నీతి ఆయోగ్ సిఫార్సులు అంటూ, రాష్ట్రానికి రావాల్సిన సహాయం లేట్ చేస్తూ వస్తుంది... అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నీతిఆయోగ్ ఇప్పటివరకూ ఏయే సిఫార్సులు చేసింది? ఏం నివేదికలు ఇచ్చిందో వెల్లడించాలంటూ ఆర్టీఐ చట్టం కింద ఇనగంటి రవికుమార్ అనే వ్యక్తి దరఖాస్తు పెట్టారు.. కాని, దీనికి సమాధానం ఇవ్వటానికి ప్రధానమంత్రి కార్యాలయం ఒప్పుకోలేదు... సమాచార హక్కు చట్టం పరిధిలో ఈ వివరాలు బయటకు చెప్పటం కుదరదు అని చెప్పింది...
ఈ విషయాలు రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉన్నందున వెల్లడించడం సాధ్యం కాదని పేర్కొంది. అలాంటి సమాచారం ఇవ్వడాన్ని ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1)(ఎ) ప్రకారం మినహాయించినట్లు పేర్కొంది. ఈ వివరాలు వెల్లడించి ఉంటే ప్రత్యెక హోదా విషయం ఎందుకు పక్కకి వెళ్ళింది, ప్రత్యేక ప్యాకేజి విషయం గురించి సమగ్ర విశ్లేషణ ప్రజల ముందు ఉండేది... మరి ఎందుకోసమో కాని, రాష్ట్రానికి సంబంధించి ఇంత కీలకమైన సమాచరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పటానికి, ప్రధానమంత్రి కార్యాలయం నిరాకరించింది.