ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం పై స్వరం పెంచారు... గుంటూరు జిల్లా ఉండవల్లిలో సియం నివాసం వద్ద జరుగుతున్న కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు కేంద్రం పై సీరియస్ వ్యాఖ్యలే చేసారు... ఆంధ్రప్రదేశ్ విభజన గురించి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసారు... ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రమేయం లేకుండానే విభజన చేశారని, అందరితో మాట్లాడి న్యాయం చేయాలంటే పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజన చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అందరూ చెబుతున్నారని, కాని న్యాయం చెయ్యండి అంటే, మాత్రం ఆలస్యం చేస్తున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారు... పెద్దన్న పాత్ర పోషించి, ఆదుకోవాలని కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నామని, విభజన హామీల విషయంలో రాజీ లేదు అని, ఎవరితోనైనా పోరాడతామని చంద్రబాబు అనంరు.... విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుంటే, కేంద్రం పై సుప్రీం కోర్టుకు వెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నానని అని చంద్రబాబు అన్నారు...
మొన్న ప్రధానిని కలిసినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు... విభజన చట్టంలో ఉన్నవే కోరుతున్నామని, అదనంగా అడగటం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దక్షిణాదిలో తలసరి ఆదాయంలో మనం అట్టడుగున ఉన్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సామర్ధ్యం లేక తలసరి ఆదాయం తగ్గలేదన్నారు... ఇవన్నీ విభజన పాపాలు అని అన్నారు... ఇతర రాష్ట్రాలతో సమానస్థాయి వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్ ను కేంద్రం ఆదుకోవాల్సిందే అని, అది కేంద్రం బాధ్యత అని తెగేసి చెప్పారు...