రాష్ట్రాలు విడిపోయాయి... ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నాము... అయినా సరే, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తన రాజకీయ పబ్బం గడుపుకోవటం కోసం, ఎప్పుడూ ఆంధ్రా ప్రజలని, ఆంధ్రా ప్రాంతాన్ని కించ పరుస్తూనే ఉంటారు.. నిన్న ఇండియా ఇండియా టుడే కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కెసిఆర్ మాట్లాడతూ, అసలు మాకు ఆంధ్రప్రదేశ్ తో పోలిక ఏంటి ? హైదరాబాద్ కి వీళ్ళు చేసింది ఏముంది ? చంద్రబాబు లాంటి వారు హైదరాబాద్ ని నాశనం చేసారు, ద్వంసం చేసారు అని అన్నారు... అలాగే నిన్న నీతీ అయోగ్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ, హైదరబాద్ లో ఉన్న ఆంధ్రా వాళ్ళు అందరూ ఆంధ్రా వచ్చేస్తే, ఆంధ్రాప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందుతుంది అని వ్యాఖ్యలు చేసారు...
కెసిఆర్ వ్యాఖ్యల పై, నీతీ అయోగ్ వైస్ చైర్మన్ వ్యాఖ్యల పై చంద్రబాబు ఇవాళ స్పందించారు... కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్ లో, ఐఏఎస్ లు కూడా కెసిఆర్ వ్యాఖ్యల పై అభ్యంతరం తెలిపారు... చంద్రబాబు చాలా హుందాగా స్పందించారు... ఆంధ్రప్రదేశ్ తో పోలికే లేదని కేసీఆర్ అన్నారని, అయితే, నేను తెలంగాణ ప్రజలను నిందించను అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలేమీ తప్పు చేయలేదని, నాటి పాలకులు చేసిన పాపం ఫలితమిది అని చంద్రబాబు అన్నారు.... 1995కు ముందు.. తర్వాత హైదరాబాద్ ఎలా ఉందో పరిశీలిస్తే.. ఎవరు అభివృద్ది చేశారో తెలుస్తుందని చంద్రబాబు అన్నారు... ఏపీ ప్రజలు చేతగానివాళ్లేం కాదని ఆయన వ్యాఖ్యానించారు...
అలాగే సీనియర్ ఐఏఎస్ ఎల్వీ సుబ్రమణ్యం కూడా కేసీఆర్ వ్యాఖ్యల పై అభ్యంతరం వ్యక్తం చేసారు... ఆంధ్రా పాలకులు తెలంగాణను విధ్వంసం చేశారన్న వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ అన్నారు... అంతేగాక హైదరాబాద్‌ను నిర్లక్ష్యం చేశారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య కూడా అభ్యంతరం తెలిపారు.... అలాగే నీతీ అయోగ్ వైస్ చైర్మన్ వ్యాఖ్యల పై స్పందిస్తూ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టే అందరూ వెళ్లారని, మళ్లీ అక్కడి నుంచి రమ్మనడమేంటి? అని అన్నారు.... ఇది చంద్రబాబుకి, కెసిఆర్ కి ఉన్న తేడా... చంద్రబాబు కూడా మా ఆంధ్రా వారి వాళ్ళే మీ హైదరాబాద్ బ్రతుకు అంటే, రాజకీయంగా ఆంధ్రా ప్రాంతంలో హీరో అవుతారు... కాని, ఆయన అలాంటి పనులు చెయ్యరు... ఆయనకు తెలుగు ప్రజలు అందరూ సమానం అనుకుంటారు కాబాట్టే, కెసిఆర్ లాంటి వారి ఆటలు సాగుతాయి... ఈ క్రింది వీడియోలో, 5:44 నుంచి చూడండి...