విజయవాడ రాజకీయాల్లోనే కాక, రాష్ట్ర రాజకీయాల్లోనే రాధా పార్టీ మారుతున్నాడు అని వస్తున్న వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి... రాధా పార్టీ మారటం, అదీ తెలుగుదేశంలోకి వెళ్ళటంతో అంతా ఆశ్చర్యపోయారు... అయితే ఇప్పుడు రాధా ఒక్కడే కాదు, రాధాతో పాటు కోస్తా జిల్లాల నుంచి అనేక మంది పేరు ఉన్న నాయకులు, రాధాతో పాటు పార్టీ మారుతున్నరన్న సమాచారం జగన్ కు తెలియటంతో, జగన్ హడలి పోయారు... రాధా ఒక్కడే అనుకుని ఇప్పటి వరకు లైట్ తీసుకున్న జగన్, రాధా వేసిన స్కెచ్ తెలుసుకుని, తన సహజ ధోరణికి భిన్నంగా, రాధాని పార్టీ వీడి వెళ్ళనివ్వద్దు అంటూ, పార్టీ సీనియర్లకు బాధ్యతలు అప్పెచేప్పారు...
అంతే కాక, రాధాకి బాగా సన్నిహితంగా ఉండే కొడాలి నానిని కూడా రంగంలోకి దింపాడు జగన్... కాని రాధా మాత్రం, గౌతం రెడ్డి ఎపిసోడ్ దగ్గర నుంచి, నిన్న యలమంచలి రవిని పార్టీలోకి తీసుకోవటం, మల్లాదికి టికెట్ అని ప్రచారం చెయ్యటం, రాధా రాజకీయ భవిష్యత్తు ప్రణాలికాబద్ధంగా నాశనం చెయ్యాలని చూడటం గమనించి, బయటకు వెళ్ళిపోవటానికి సిద్ధం అయ్యారు.. ఎన్ని సార్లు జగన్ కు మోర పెట్టుకున్నా, నేను ముఖ్యమంత్రి అవ్వగానే నీ గురించి ఆలోచిస్తాను అని చెప్పటం కూడా రాధాని ఆలోచలనలో పడేసింది...
దీంతో రాధా కూడా, జగన్ కు కౌంటర్ గా గెట్టి దెబ్బ వెయ్యటానికి స్కెచ్ గీస్తున్నట్టు సమాచారం వస్తుంది... వంగవీటి రంగా అంటే ఇప్పటికీ కాపు సామజికవర్గంలో పేరు ఉంది... వంగవీటి రంగాకి కోస్తా జిల్లాల్లో, ఉభయ గోదావారి జిల్లాల్లో, చాలా మంది అనుచరులు ఉన్నారు... ఇప్పటికే కొంత మంది పెద్ద నాయకులుగా ఉన్న వారు కూడా ఉన్నారు... రాధా ఇప్పుడు తన పవర్ అంతా చూపించాలి అని అనుకుంటున్నారు.. వారి అందరినీ కూడగట్టి, తన బలం ఏంటో, జగన్ కు చూపించాలి అనే ప్రయత్నం చేస్తున్నారు... ఇప్పటికే కాపు సామజికవర్గంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల పట్ల సానుకూలతతో ఉన్నారు.. కాపుల మీద చిన్న చూపు చూస్తున్న జగన్ వైఖరి తో విసిగిపోయిన వాళ్ళు అదను చూసి పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు... వీరందరినీ రాధా లీడ్ చేసి, టీడీపీలోకి తీసుకెళ్లేందుకు రాధా స్కెచ్ వేసారు.. మొన్నటిదాకా రాధా వెళ్ళిపోతాడు అంటే లైట్ తీసుకున్న జగన్, ఈ స్కెచ్ తెలిసి అవాక్కయ్యి, రాధాను వెళ్ళనివ్వకుండా బుజ్జగిస్తున్నారు... ఇది సఫలం అవుతుందో లేదో చూడాలి...