మూడు రోజుల సంక్రాంతి పండుగ విరామం అనంతరం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి చేరుకున్నారు... తన స్వగ్రామం, చిత్తరు జిల్లా, నారా వారి పల్లిలో సంక్రాంతి పండుగ చేసుకున్న విషయం తెలిసిందే... ఇవాళ సాయంత్రం, ముఖ్యమంత్రి అక్కడ నుంచి అమరావతి వచ్చారు... వచ్చీ రావటంతోనే రివ్యూ చేసారు... ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు అమ్మకంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించి తక్షణం ధాన్యం కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పౌరసరఫరాల శాఖను ఆదేశించారు.
పట్టిసీమ నీటితో అధిక దిగుబడులు వచ్చినప్పటికీ పౌరసరఫరాల శాఖ ఆంక్షల మూలంగా రైతులు కల్లాల్లోనే ధాన్యాన్ని నిల్వ ఉంచుకోవాల్సిన దుస్థితి నెలకొందన్న విషయం తెలిసి సీఎం చంద్రబాబు ఆవేదనకు గురయ్యారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుపై ఆంక్షలు విధించి ఇబ్బందులు గురు చేస్తున్న కృష్ణాజిల్లా రెవిన్యూ యంత్రాంగంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, రైస్ మిల్స్ అసోషియేషన్ నాయకులు ఉండవల్లిలో నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ధాన్యం కొనుగోలులో ముఖ్యంగా కృష్ణా జిల్లాలో పౌరసరఫరాల శాఖ ఆంక్షలుతో ఎదురవుతున్న సమస్యలను వివరించారు.
ఆ విషయంపై పౌరసరఫరాల కమిషనరు రాజ శేఖర్, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ విజయ కృష్ణను పిలిపించి మాట్లాడారు. రైతుల వద్ద నున్న ధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేసి సమస్య పరిష్కరించాలి సీఎం చంద్రబాబు సూచించారు. ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలని కూడా ఆదేశించారు. ముఖ్యమంత్రి వచ్చీ రావటంతోనే రివ్యూ చెయ్యటంతో అధికార యంత్రాంగం మొత్తం అలెర్ట్ అయ్యింది... రేపు ఢిల్లీ పర్యటన ఉంది కాబట్టి, రేపు కూడా రిలాక్స్ అవ్వచ్చు అనుకున్నారు.. కాని ముఖ్యమంత్రి ఇవాళ సాయంత్రం నుంచే పనిలోకి దిగటం, అందరూ అలెర్ట్ అయ్యారు...