ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో మరో విశిష్ట సౌకర్యం అందుబాటులోకి వచ్చింది... హూద్ హూద్ లాంటి విపత్తులు ఎదుర్కునేందుకు సాంకేతికత తోడుగా నిలావాలని నగర ప్రజలంతా బలంగా కోరుకుంటున్న తరుణంలో అలాంటి ఒక సర్వీస్ ఇప్పుడు విశాఖలో కులువుదీరింది.. స్మార్ట్ పోల్ గా పిలిచే ఈ స్తంబంలో ఏడు రకాల సేవలు అందుబాటులోకి వస్తాయి... నగరంలో ఇలాంటివి 50 పోల్స్‌ను ఏర్పాటు చేసేందుకు వీలుగా స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు కింద టెండర్లు పిలవగా ఎల్ అండ్ టీ సంస్థ పనులు దక్కించుకుంది. దీంతో డైమండ్‌పార్కు వద్ద తొలి పోల్ ఏర్పాటు పనులను ఇటీవల ప్రారంభించింది...
1. స్మార్ట్ పోల్‌పైన 3 విద్యుత్ లైట్లు ఉంటాయి. ఇవి వాతావరణ పరిస్థితులను బట్టి లైటింగ్ ఇస్తాయి. అంటే రాత్రివేళ ఎక్కువ లైటింగ్ ఉంటే.. తెల్లవారుజాము నుంచి కాంతిని తగ్గించేస్తాయి. 2. స్మార్ట్ పోల్ కు వైఫై డివైజ్ అమర్చి ఉంటుంది. ఇది ఇంటర్నెట్ సిగ్నల్స్ ఇస్తుంది. 3. స్మార్ట్ పోల్ పైన రెండు సీసీ కెమెరాలు ఉంటాయి. ఇవి 180 డిగ్రీల పరిధిలో దృశ్యాలను రికార్డు చేసి జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి లైవ్ లో పంపిస్తాయి..
4.స్మార్ట్ పోల్ పై ఎన్విరాన్‌మెంటల్ సెన్సర్ ఒకటి ఉంటుంది. ఆ స్మార్ట్ పోల్ ఉన్న ప్రాంతంలో గాలి, వాయు కాలుష్య తీవ్రత, ఉష్ణోగ్రత, వర్షపాతం వంటి వివరాలు కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తుంది. 5. స్మార్ట్ పోల్ పై నాలుగు స్పీకర్లు ఉంటాయి. విపత్తుల సమయంలో అక్కడ ప్రజలను అప్రమత్తం చేయడానికి, ఏదైనా అత్యవసర సమాచారం అందజేయడానికి ఇవి ఉపయోగపడతాయి. 6. ఒక ఆడ్ బోర్డు ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు బోర్డు పై ప్రకటనల కోసం కార్పొరేషన్ ను సంప్రదించవచ్చు. 7.పోల్‌పైన ఏదైనా టెలికాం సంస్థ సిగ్నల్ యాంటీనా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. నెట్‌వర్క్ సిగ్నల్స్ ఆయా ప్రాంతాల్లో బలహీనంగా వున్నట్టయితే ఆ పోల్‌పై యాంటీనా ఏర్పాటుచేసుకుంటే సర్వీసును మెరుగుపరుచుకోవచ్చు.