ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హోదా గురించి చెప్పాల్సిన పని లేదు.... ఆయన ఒక ముఖ్యమంత్రిగానే కాదు, ఒక సుదీర్ఘ రాజకీయ నేపద్యం ఉన్న రాజకీయ ఉద్దండుడిగా ప్రపంచ వ్యాప్తంగా పేరు ఉన్న నేత... అలాంటి చంద్రబాబు నిన్న పండుగ పూట , సొంత ఊరిలో ఒకరికి సారీ చెప్పారు... వివరాలు ఇలా ఉన్నాయి.... ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత ఊరు నారావారిపల్లెలో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే... అక్కడ ఉన్న స్థానికులు తమ సమస్యలపై అర్జీలు అందజేయడానికి భారీ సంఖ్యలో చంద్రబాబు ఇంటికి వచ్చారు...
దీంతో చంద్రబాబు ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఇంటి ముందు పెద్ద ఎత్తున ప్రజలు ఉండటంతో, దాదాపు రెండు గంటలు అక్కడ రాకపోకలు నిలిపివేశారు.సహజంగా అంత సేపు ట్రాఫిక్ ఆపటంతో, అటు వైపు నుంచి వెళ్ళే ప్రజలు ఇబ్బందులు పడ్డారు... ఇదే సందర్భంలో నవీన్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి తన కుటుంబంతో కలిసి, తన సొంత ఊరు దిగువ మూర్తిపల్లెకు వస్తున్నారు... అక్కడ ట్రాఫిక్ ఆపివేయ్యటంతో, దాదాపు కిలోమీటరు దూరం నుంచి కాలి నడకన నడవాల్సి వచ్చింది...
దీంతో నవీన అనే వ్యక్తి, అక్కడ పోలీసులు పై అసహనం వ్యక్తం చేసారు... అక్కడ ఉన్న పోలీసులు పై తన అసహనం అంతా చూపించారు.... అయితే, ముఖ్యమంత్రి అక్కడే ఉన్న సంగతి నవీన్ గమనించుకోలేదు... ఇదంతా చూస్తున్న ముఖ్యమంత్రి, విషయం తెలుసుకుని నవీన్‌కు సారీ చెప్పాడు. వెంటనే ట్రాఫిక్ సమస్యను పరిష్కరిచమని పోలీసులను ఆదేశించారు. ఒక ముఖ్యమంత్రి, అదీ చంద్రబాబు స్థాయి వ్యక్తి, తన వల్ల కలిగిన అసౌకర్యానికి, ఒక సామాన్యుడికి సారీ చెప్పటంతో అక్కడ ఉన్న ప్రజలు హర్షధ్వానాలు తెలిపారు... పోలీసులు కూడా, ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది... 10-15 నిమషాలు అయితే అడ్జెస్ట్ అవుతారు కాని, అన్ని గంటలు ఆపటం కూడా కరెక్ట్ కాదు... చంద్రబాబు ఈ విషయం అర్ధం చేసుకుని, వెంటనే అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేపించారు...