ఢిల్లీలో సీఐఐ భాగస్వామ్య సదస్సు-2018 సన్నాహక సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు పాల్గున్నారు... ఇదే సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి సురేశ్ ప్రభుతో కలిసి, ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న పలు దేశాల పారిశ్రామికవేత్తలు పాల్గున్నారు... ఈ సమావేశంలో పాల్గునటానికి చంద్రబాబు ఉదయం వైజాగ్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లారు... ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెట్టుబడుల వాతావరణం గురించి వివరించారు...
చంద్రబాబు మాట్లాడుతూ, "సులభతర వాణిజ్యంలో అగ్రస్థానంలో ఉన్నాం... రాష్ట్రంలో ఉత్తమమైన మౌలిక వసతులు ఉన్నాయి... రెండో తరం విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తు్న్నాం... రాష్ట్రంలో పెద్దఎత్తున సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నాం... ఫైబర్ గ్రిడ్ ద్వారా 15 ఎంబీపీఎస్ వేగంతో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందిస్తాం... రాజధాని అమరావతి నిర్మాణంలో అవకాశాలు మెండుగా ఉన్నాయి.. పెట్టుబడిదారులకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం... రియల్ టైమ్ లో ఎయిర్ క్వాలిటీని అంచనా వేస్తు్న్నాం" అని అన్నారు...
ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఫిబ్రవరిలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు రండి.. మీ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం... ఇక్కడ పరిస్థితులు చూసి, మీరు స్వయంగా ఇక్కడ ఉన్న వసతులు పరిశీలించి పెట్టుబడులు పెట్టండి... ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికి రెండుసార్లు సీఐఐ భాగస్వామ్య సదస్సులు నిర్వహించాం... మూడో సారి వరసుగా వచ్చే నెలలో నిర్వహిస్తున్నాం...మీరందరూ తప్పకుండా వచ్చి పాల్గునండి అంటూ, చంద్రబాబు అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడారు...