ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలని పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గత రెండు రోజులుగా నిరసనలకు దిగిన తెలుగుదేశం ఎంపీలు, వరుసగా మూడో రోజు కూడా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి... ఉభయ సభల్లో తెదేపా సభ్యులు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై గళమెత్తుతున్నారు... ఈ ఉదయం కొందరు ఎంపీలతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు, హామీల అమలుకు నిర్దిష్ట కాలపరిమితిని ప్రకటించాలని అప్పటివరకు పోరాడుతూనే ఉండాలని, ప్రజల బాధ, దేశానికి చెప్పాలని ఆదేశాలు ఇచ్చారు...
ఇవాళ ప్రధాని ప్రసంగం ఉంటుంది అని, ప్రధాని ప్రసంగం చేసేప్పుడు కూడా, ఆందోళన కొనసాగించాలని చంద్రబాబు ఎంపీలకు ఆదేశాలు ఇచ్చారు... పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసినా వెనుకంజ వేయవద్దని ఎంపీలకు ఆదేశాలు ఇచ్చారు... పార్లమెంటు సమావేశాలు మరో రెండు రోజులు మాత్రమే ఉన్నాయని... నిరసన వ్యక్తం చేసే క్రమంలో ఏ మాత్రం తగ్గవద్దని, కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచాలని తమ ఎంపీలను ఆదేశించారు.
ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని, విభజన సమయంలో పార్లమెంట్ లో ఆరు నెలలు పోరాటం చేశామని గుర్తు చేసిన ఆయన, ప్రజాభీష్టం మేరకే తాను నడుచుకుంటానని స్పష్టం చేశారు. ఏపీ సమస్యలను జాతీయ స్థాయి అజెండాగా మార్చామన్నారు. అలాగే ఏపీకి జరిగిన అన్యాయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేశామని, దీనిని హేతుబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలి... రాష్ట్ర ప్రయోజనాలను సాధించాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు.