మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు (71) మంగళవారం అర్థరాత్రి కన్నుమూశారు. రెండ్రోజులుగా జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రాణాలు నిలిపేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో చివరికి ఆయన తనువుచాలించారు. ప్రస్తుతం తిరుపతిలోని పద్మావతిపురంలో ఉంటున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నాయకునిగా పలు పదవులు చేపట్టారు.

1983లో ఎన్టీఆర్‌ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. పుత్తూరు నుంచి ఆరుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి రికార్డులకెక్కారు. 2014 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం తెదేపా ఎమ్మెల్సీగా సేవలందిస్తున్నారు. జ్వరంతో బాధపడిన ముద్దుకృష్ణమను కుటుంబీకులు తిరుపతి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ‘‘డెంగ్యూ జ్వరం, బీపీ కంట్రోల్‌ లేని స్థితిలో ఆదివారం ఆయన ఆస్పత్రిలో చేరారు. రెండురోజుల్లోనే మల్టీఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ వల్ల పరిస్థితి చేయిదాటిపోయింది’’ అని కేర్‌ వైద్యుడు డాక్టర్‌ కళాధర్‌ తెలిపారు.

మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు (71) మంగళవారం అర్థరాత్రి కన్నుమూశారు. డెంగ్యూ జ్వరంతో కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు హఠాన్మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి చెందారు. గాలి మృతి పట్ల ఆయన కుటుంబసభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీడీపీ ప్రస్థానంలో ముద్దుకృష్ణమది ముఖ్య భూమిక అని చంద్రబాబు తెలిపారు. క్రీయాశీల రాజకీయాల్లో ఎంతో చురుగ్గా ఉంటూ పార్టీకి, ప్రజలకు ఆయన అందించిన సేవలు మరచిపోలేనివి అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read