నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో, దేశంలోని సుప్రసిద్ధ విద్యాసంస్థల్లో ఒకటైన అమృత యూనివర్సిటీ ఏర్పాటు కానుంది... మంగళగిరి మండలం కురగల్లు, యెర్రబాలెం గ్రామాల మధ్య అమృత విద్యాపీఠ్‌ మాతా అమృతానందమయి ఆర్గనైజేషన్‌ తరఫున 150 ఎకరాల్లో ఏర్పాటుకానున్న విశ్వవిద్యాలయ ప్రాంగణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం శంఖుస్థాపన చేయనున్నారు. సుమారు ఐదువేల మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నామని తెలిపారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ చెప్పారు .

amrita amaravati 06022018 2

అమృత విశ్వవిద్యాలయం అమరావతి ప్రాంగణ ఇన్‌ఛార్జి స్వామి సదాశివచైతన్య మాట్లాడు తూ భారతదేశంలో ఇది ఏడవ ప్రాంగణమని చెప్పారు. మొదటిదశలో 150 ఎకరాలలో ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సును, సెకండ్‌ ఫేజ్‌లో మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రి, మూడో ఫేజ్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఫస్ట్‌ఫేజ్‌లో ఇంజనీరింగ్‌లో 640 సీట్లు, మేనేజ్‌మెంట్‌లో 120 సీట్లు ఏర్పాటు చేయనున్నట్లు స్వామీజీ తెలిపారు. మొదటిదశలో రూ.150 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. 2018 ఆగస్టు నుంచి తరగతులను ప్రారంభిస్తామని తెలిపారు.

amrita amaravati 06022018 3

ఈ విశ్వవిద్యాలయం క్యాంపస్‌కు సంబంధించిన ఆకృతులను ఇటీవల సీఎంకు ‘అమృత’ ప్రతినిధులు చూపారు... ముఖ్యంగా ప్రవేశద్వారం, మంగళగిరి గాలిగోపురాన్ని ప్రతిబంబించే విధంగా ఉండటం, బాగా ఆకర్షించింది.. అమృత అమరావతి యూనివర్శిటీ క్యాంపస్‌ లో, అత్యాధునికమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో సహా మెడికల్‌ విద్యా,వైద్యసంస్థలు మరియు ఇంజినీరింగ్‌ సంస్థలను కూడా నెలకొల్పనున్నట్లు తెలిసింది... దేశంలోని ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో నంబర్వన్ స్థానంలో, అన్ని యూనివర్సిటీల్లో 9వ అత్యుత్తమైనదిగా, ఆసియా ఖండం బెస్ట్‌ యూనివర్సిటీల్లో 168గా పేరొందిన అమృత సంస్థకు దేశంలోని అమృతపురి, కోయంబత్తూరు, కొచ్చిన్‌, బెంగుళూరు, న్యూఢిల్లీలలో ఇప్పటికే 5 క్యాంపస్ ఉన్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read