ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయం పై, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మాట్లడారు... ఒక విధంగా చెప్పాలి అంటే, దుమ్ము దులిపేసారు.... మనం ఏమి అనుకుంటున్నామో, మన మనసులో బాధ ఏంటో, దేశం మొత్తం వినిపించారు... ప్రతి సమస్య పై మాట్లడారు... పోలవరం పై ఇప్పటి వరకు సవరించిన అంచనాలు ఆమోదించలేదు... వెంటనే వాటిని ఆమోదించండి అని అన్నారు... ఇక విజయవాడ, వైజాగ్ మెట్రో పై విరుచుకుపడ్డారు... కర్ణాటక మెట్రో కి 17 వేలు కోట్లు ఇచ్చారు, ముంబై కి 51 వేల కోట్లు ఇచ్చారు.. కాని వైజాగ్, విజయవాడ మెట్రో కోసం, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు... కర్ణాటకలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, అక్కడ ఇచ్చారా ?
మాకు ఎలక్షన్స్ వస్తే కాని ఇవ్వరా అంటూ గల్లా కేంద్రాన్ని నిలదీశారు... ఇదేమి న్యాయం... మీరే చెప్పండి, ఇదేమి న్యాయం... సబ్కా వికాస్ అంటే ఇదేనా అంటూ నిలదీశారు... డెవలప్మెంట్ విషయంలో రాజకీయలు ఉండవు అని చెప్తారు, ఇదేనా అంటూ నిలదీశారు... అలాగే వైజాగ్ రైల్వే జోన్ విషయం పై రైల్వే మంత్రి పై కూడా విమర్శలు గుప్పించారు... ఇప్పటికీ నాలుగు ఏళ్ళు అయిన తరువాత కూడా, ఇంకా సంప్రదింపులు ఏంటి ? ఇంత సీనియర్ మంత్రి అయిన పియూష్ గోయెల్ ఇప్పటికీ సంప్రదింపులు అంటున్నారు అంటే, ఇది తాత్సారం చెయ్యటం కాక ఇంకేంటి అంటూ నిలదీసారు.. అమరావతి గురించి ప్రస్తావిస్తూ, రాజధానికి అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆక్ట్ లో ఉంది... గవర్నమెంట్ బిల్డింగ్స్ వాటి ల్యాండ్ వేల్యూ, నిర్మాణ ఖర్చు, 40 వేల కోట్లు అవుతుంది అని మీకు పంపించాం... కాని ఇప్పటికి, రెండు వేల కోట్లకు మించి ఇవ్వలేదు అంటూ వచ్చే నాలుగు ఏళ్ళల్లో, ప్రతి ఏటా రాజాదానికి 10 వేల కోట్లు ఇవ్వాలి అని అన్నారు...
ఆర్ధిక లోటు విషయంలో, ఇవాళ అధికారులు సమక్షంలో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి, వాటి వివరాలు వచ్చిన తరువాత దాని గురించి మాట్లాడతాను అని చెప్పారు... అలాగే వివిధ విద్యా సంస్థలకు, ఇస్తున్న నిధులతో, అవి కట్టాలి అంటే, అవి 30 ఏళ్ళకు కూడా పూర్తి కావు అన్నారు.. ఎయిమ్స్ కి కనీసం ఒక్క రూపాయి ఇవ్వలేదు అని, మాకు ఎన్నికలు లేవు అని ఇవ్వలేదేమో అని ఎద్దేవా చేసారు... చివరగా, మాకు బడ్జెట్ లో ఇచ్చినవి, బాహుబలి సినిమా కలెక్షన్స్ అంత కూడా లేవు అని, సోషల్ మీడియాలో ప్రజలు అనుకుంటున్న విధంగా గల్లా పార్లమెంట్ లో చెప్పారు... కాంగ్రెస్ మాకు అన్యాయం చేసినందుకు, వారికి సున్నా ఇచ్చాం, మీరు ఏమి చెయ్యటం లేదు... ఇలాంటి మీతో మేము ఎందుకున్నమా అనిపిస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు... మీరు అర్ధం చేసుకోండి, మేము మీ మిత్రులం, మాకు న్యాయం చేసి, మిత్ర ధర్మం పాటించండి... ఇప్పుడు కాకపొతే, మీకు కాంగ్రెస్ గతే పడుతుంది... మా రాష్ట్ర ప్రజలు ఫూల్స్ కాదు అంటూ ముగించారు... మొత్తానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో, గల్లా అదే, పార్లమెంట్ లో వినిపించారు... ఎక్కడ అన్యాయం జరిగిందో, అక్కడే మన ఆక్రోశం వినిపించారు...