మన నాయకులు రోజు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు, కాని వారే వాటిని ఆచరించారు. కాని, విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీధర్ , ఆయన చెప్పేది ఆచరించి ఆదర్శంగా నిలిచారు. ప్రతి సంధర్బంలో, మన నాయకులు వైద్యం కోసం, గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్ళమంటూ ఉంటారు... అయితే, ముందుండి ఆచరించి, ఆదర్శంగా నిలిచేవారు మాత్రం చాలా తక్కువ. వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు.. అలాంటి వారిలో ఇప్పుడు, విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీధర్ కూడా చేరారు... ఎదో అందరికీ చెప్పటం కాదు, చేసి చూపించారు.. ప్రజల్లో ప్రభుత్వ హాస్పిటల్స్ పట్ల విశ్వాసం కలిగించారు...
విజయవాడ నగరంలోని కొత్త ఆసుపత్రిలో మేయర్ కోనేరు శ్రీధర్ శనివారం కేటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు... అక్కడ ఆపరేషన్ చేపించుకున్నట్టు, ప్రముఖులకి ఎవరికీ తెలియదు... ఆయన మీడియా సమావేశం పెట్టేదాకా, ఎవరికీ విషయం తెలియదు... ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాస్పత్రులపై ప్రజల్లో చులకన భావాన్ని పోగొట్టేందుకే ఆపరేషన్ చేయించుకున్నానని ఆయన పేర్కొన్నారు... ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా సౌకర్యాలున్నాయని, ఎంతో అనుభవం ఉన్న వైద్యులు అందుబాటులో ఉన్నారని మేయర్ పేర్కొన్నారు... పేదలే కాదని, అన్ని వర్గాల వారు ధీమాగా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వైద్యం చేసుకోవచ్చు అని, సీనియర్ వైద్యులు, అత్యాధునిక పరికరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నారు...
ఈ విషయం తెలుసుకున్న పలువురు, మేయర్ కోనేరు శ్రీధర్ ను అభినందించారు. సాక్షాత్తు విజయవాడ ప్రధమ పౌరుడు గవర్నమెంట్ హాస్పిటల్లో, వైద్యం చేపించుకోవటం, అదీ కంటికి సంబంధించిన కీలకమైన ఆపరేషన్ చేపించుకోవటం ప్రజలకు మంచి సందేశం వెళ్తుంది అని, ప్రభుత్వ హాస్పిటల్స మీద ప్రజలకు మంచి అభిప్రాయం ఏర్పడుతుంది అని, మేయర్ ని అభినందించారు.... మేయర్ కాబట్టి, ఆయనకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు అని అనుకోవచ్చు... కాని, ఇలా చేసినందు వలన, ఎంతో కొంత ప్రజల్లో విశ్వాసం ఉంటుంది...