నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో, దేశంలోని సుప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో 9వదిగా ఉన్న అమృత యూనివర్సిటీ ఏర్పాటు కానుంది... వచ్చే నెల 7వ తేదీన శంకుస్థాపన జరగనున్నట్లు విశ్వస నీయంగా తెలిసింది. ముఖ్యమంత్రి చంద్ర బాబు చేతులమీదుగా ఈ కార్యక్రమం జరగబోతోందని సమాచారం. రాజధాని గ్రామాలైన నవులూరు- ఎర్రబాలెంల మధ్య రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 200 ఎకరాల్లో రూపుదిద్దుకోబోతున్న ఈ విశ్వవిద్యాలయం క్యాంపస్‌కు సంబంధించిన ఆకృతులను ఇటీ వల సీఎంకు ‘అమృత’ ప్రతినిధులు చూపారు.
ముఖ్యంగా ప్రవేశద్వారం, మంగళగిరి గాలిగోపురాన్ని ప్రతిబంబించే విధంగా ఉండటం, బాగా ఆకర్షించింది... మంగళగిరి నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో, నవులూరుకు సమీపంలో ఈ అమృత అమరావతి యూనివర్శిటీ క్యాంపస్ ఏర్పాటు కానుంది. ఇందులో అత్యాధునికమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో సహా మెడికల్ విద్యా,వైద్యసంస్థలు మరియు ఇంజినీరింగ్ సంస్థలను కూడా నెలకొల్పనున్నట్లు తెలిసింది... దేశంలోని ప్రైవేట్ యూనివర్సిటీల్లో నంబర్వన్ స్థానంలో, అన్ని యూనివర్సిటీల్లో 9వ అత్యుత్తమైనదిగా, ఆసియా ఖండం బెస్ట్ యూనివర్సిటీల్లో 168గా పేరొందిన అమృత సంస్థకు దేశంలోని అమృతపురి, కోయంబత్తూరు, కొచ్చిన్, బెంగుళూరు, న్యూఢిల్లీలలో ఇప్పటికే 5 క్యాంపస్ ఉన్నాయి.
అమరావతిలో, 5 ఏళ్లలో పూర్తయ్యే తొలి దశను 150 ఎకరాల్లో, 5 నుంచి 7 ఏళ్లల్లో సిద్ధమయ్యే మలి దశను 50 ఎకరాల్లో నిర్మించనున్నారు... 5 ఏళ్లలో పూర్తయ్యే తొలి దశను 150 ఎకరాల్లో, 5 నుంచి 7 ఏళ్లల్లో సిద్ధమయ్యే మలి దశను 50 ఎకరాల్లో నిర్మించనున్నారు... మొత్తం 6 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణముండే 7 అంతస్థుల భవన సముదాయాలను ఈ క్యాంపస్‌లో నిర్మిస్తారు. .. విద్యార్థినీ విద్యార్థుల కోసం వేర్వేరుగా వసతిగృహాలను జి ప్లస్ 10 ఫ్లోర్లతో నిర్మించనున్నారు.... అధ్యాపకులు, ఉద్యోగుల కోసం లక్షకు పైగా చదరపుటడుగుల విస్తీర్ణంలో, 14 అంతస్థుల్లో, 104 అపార్ట్‌మెంట్లను నిర్మిస్తారు.