బీజేపీ, జగన్ పొత్తు పై జోరుగా వార్తలు వింటూనే ఉన్నాం... సాక్షాత్తు జగన్ మోహన్ రెడ్డే, బీజేపీ కనుక మేము, ప్రత్యెక హోదా ఇస్తాము అని ప్రకటిస్తే, బీజేపీతో కలుస్తాము అంటూ, బంపర్ ఆఫర్ ఇచ్చారు... ఇక రాష్ట్ర బీజేపీ సంగతి అయితే చెప్పనవసరం లేదు.... ఎప్పుడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీని వదిలి, జగన్ మోహన్ రెడ్డి పంచన చేరదామా అనే ఆతృతలో ఉన్నారు... సోము వీర్రాజు, పురంధేశ్వరి, మాణిక్యాల రావు, విష్ణు కుమార్ రాజు లాంటి వారు అయితే, జగన్ ను బహిరంగంగానే పొగిడేస్తున్నారు... విష్ణు కుమార్ రాజు అయితే రెండు రోజుల క్రితం ఏకంగా, అసెంబ్లీలోని వైసిపీ ఆఫీస్ లోనే, వైసిపీ నాయకులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు...
అదేంటి అని మీడియా అడిగితే, తప్పేముంది అంటూ సమాధానం ఇచ్చారు... అవసరమైతే, జగన్ విశాఖ వచ్చినప్పుడు, మా ఇంటికి భోజానానికి కూడా పిలుస్తాను, అంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు... వీళ్ళద్దరి మధ్య బంధం అంత గెట్టిగా ఉంది... ఇదే విషయం పై, ఇవాళ దావోస్ పర్యటన వివరాలు గురించి విలేకురాలకి చెప్తున్న సందర్భంలో, చంద్రబాబుని అడిగింది మీడియా... బీజేపీతో పొత్తుకు సిద్ధమని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల పై, మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే, చంద్రబాబు స్పందించారు...
ఒక పక్క వాళ్ళు మేము ఇవ్వం అని చెప్తున్నా, జగన్ ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో కలిసి పని చేస్తానని కొత్తగా అనడం లేదని ముఖ్యమంత్రి అన్నారు. అసలు జగన్ కు నిలకడ ఎక్కడ అని, జగన్ ఏ మాట మీదా నిలబడడని, ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీమా చేయిస్తా అన్నాడని.. ఇప్పుడు ఆ మాటలు ఏమయ్యాయి అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చినపుడు, ప్రత్యేక హోదా ఇస్తేనే నేను మీకు మద్దతు ఇస్తాను అని జగన్ అప్పుడు ఎందుకు అనలేదు అని, అప్పుడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కేసుల నుంచి బయటపడటానికి, అక్రమ ఆస్తులు కాపాడుకోవడటానికి జగన్ చేసే ప్రయత్నాల్లో ఇదొకటని చంద్రబాబు పంచ్ చేశారు...