కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తక్కువ కేటాయింపులు ఇచ్చింది అని, రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు, అధికారులు, మంత్రులు, సమీక్షలు మీద సమీక్షులు చేస్తున్నారు... కేంద్ర బడ్జెట్ పేపర్లు అన్నీ తిరగేసి, మన కేటాయింపుల పై సమీక్షలు చేస్తున్నారు... మనం అడిగింది ఎంత, ఇన్నాళ్ళు కేంద్రం ఇచ్చింది ఎంత, మనకు కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వటం లేదు, ఎక్కువ నిధులు ఎలా తెచ్చుకోవాలి, ఏ మార్గాల్లో ఒత్తిడి తేవాలి, రాజకీయ నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, ఖటిన నిర్ణయాలు తీసుకుంటే, రాష్ట్రం పై ఎలాంటి ఆర్ధిక భారం పడుతుంది లాంటి వాటి పై, సమీక్షలు చేస్తున్నారు...
అయితే, స్వతహాగా ఆడిటర్ అయ్యి, దొంగ లెక్కలతో జగన్ కు మేలు చేసి, 11 కేసుల్లో A2గా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం అసలు కారణం నాకు తెలుసు అంటూ, ఇవాళ మీడియాకు చెప్పారు...రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపై కేంద్ర ప్రభుత్వ పెద్దలకు పూర్తి అవగాహన ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. నిధులు దుర్వినియోగం అవుతాయనే.. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు తగ్గించారన్నారు.
శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు తన స్వలాభం కోసం రాష్ట్రానికి దక్కాల్సిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధం అని విజయసాయి పునరుద్ఘాటించారు. రైల్వే జోన్ ఏర్పాటుకు చట్ట సవరణ అవసరం లేదని, ఏపీ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా అవసరం అని పేర్కొన్నారు.