చంద్రబాబు మాంచి ఫ్లో లో ఉన్నారు... ఎలక్షన్ మూడ్ లో కి వచ్చేసినట్టు ఉన్నారు.. ఒక పక్క ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు... మీరు వద్దనుకుంటే దండం పెట్టి తప్పుకుంటాం అంటూ వ్యాఖ్యలు చేసి, సంచలనం సృష్టించారు... ఈ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో కూడా చర్చనీయంసం అయ్యాయి... ఇది ఒక ఎత్తు అయితే, రెండో వైపు సొంత పార్టీ నేతలకు జర్క్ ఇచ్చారు చంద్రబాబు... మనం ఎన్నో మంచి పనులు చేస్తున్నాం.. ప్రజలకి దశాబ్ద కాలాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలు తీర్చుతున్నాం... చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం... ఇన్ని చేస్తున్నా, కొంత మంది నేతల వలన, కొన్ని నియోజకవర్గాల్లో వెనుకబడ్డాం, అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పారు చంద్రబాబు...
అంతే కాదు, మీ పని తీరు ఇలాగే కొనసాగితే, మిమ్మల్ని వదులుకుంటానికి కూడా సిద్ధం అంటూ, మిమ్మల్ని నా ఇంటికి భోజనానికి పిలిచి పంపిస్తానని, ఇక మీకు టికెట్లు ఇవ్వను అంటూ, ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు... చంద్రబాబు రియాక్షన్ తో సొంత పార్టీ నేతలకు దడ మొదలైంది... ఎప్పుడు ఆయన ఫోన్ చేసి, ఎవర్ని భోజనానికి రమ్మంటారో అంటూ నేతలు హడలి పోతున్నారు... ఎమ్మల్యేలతో పాటు, నియోజకవర్గాల్లో ఉన్న ఇంఛార్జిల్లో కొంత మందికి త్వరలోనే, చంద్రబాబుకి ఇంటికి భోజనానికి రమ్మని పిలుపు వచ్చే అవకాసం ఉంటుంది అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి....
ఇప్పటికే చంద్రబాబు సర్వేలు చేపించారు... ఆ సర్వే వివరాలు వ్యక్తిగతంగా ఆయా నియోజకవర్గ ఇంఛార్జలకు అందచేసారు... వెనుకబడిన వారికి ఇప్పటికే పని తీరు మేరుగుపరుచోకోమని చెప్పారు కూడా... రాష్ట్ర ప్రయోజనాల కోసం, బీజేపీనే వదులుకుంటున్న చంద్రబాబు, ఇక మా గురించి ఆలోచించారు అని, చంద్రబాబు ఒక ప్రణాలికా బద్ధంగా వెళ్తున్నారని, నాయకులు హడలి పోతున్నారు... ఇప్పటికే భోజనానికి ఎవర్ని పిలవాలి అనే లిస్టు కూడా రెడీ అయ్యింది అని సమాచారం... మరో ఒక్క నెల రోజుల్లో, మరో సర్వే జరగనున్నట్టు సమాచారం... ఆ సర్వేలో కూడా, వారి పని తీరు మెరుగుపరుచుకోకపోతే, వారిని తన ఇంటికి పిలిచి, వారి కుటుంబ సభ్యులని కూడా రమ్మని, భోజనం పెట్టి, ఇన్నాళ్ళు పార్టీకు సేవ చేసినందుకు ధన్యవాదాలు చెప్పి, వారికి ఒక నమస్కారం పెట్టనున్నారు చంద్రబాబు..