వీరు అధికారంలో లేకపోతేనే ఇలా చేస్తున్నారు... అదే అధికారంలో ఉంటే... వీరు ఏమి చేస్తారో ఊహించటానికి కూడా కష్టం... వీరికి అడ్డు వస్తే, ఎంతటి వాడైనా అనుభవించాల్సిందే... చివరకు గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలు కూడా, వీరి దాష్టికానికి బలవ్వాల్సిందే... గుంటూరు జిల్లా, పిడుగురాళ్ళ మండలం, కోనంకి గ్రామంలో160 గుడిసెలు తగలుబెట్టారు వైసీపీ నేతలు... దీంతో ఆ 160 కుటుంబాలు రోడ్డున పడ్డాయి... మా జీవతాలు నాశనం చేసిన వారిని అరెస్ట్ చెయ్యాలి అంటూ, బాధితులు ఆందోళన చేసారు...
గుంటూరు జిల్లా, పిడుగురాళ్ళ మండలం, కోనంకి గ్రామంలో BC,SC,ST కులాల్లో ని ఇళ్లు లేని పేదలకు ప్రభుత్వం, ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసింది... ప్రభుత్వం స్థాలాలు ఇవ్వటంతో, అక్కడే ప్రభుత్వం ఇల్లు కూడా కట్టిస్తాం అని హామీ ఇచ్చింది... ప్రభుత్వం పక్కా ఇల్లు కట్టే దాకా, 160 కుటుంబాలకి చెందిన వారు, అక్కడే గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు... ఇవాళ ఉదయం, ఉన్నట్టు ఉండి మంటలు వచ్చాయి... క్షణాల్లో 160 గుడిసెలు ఆహుతి అయిపోయాయి... అదృష్టవసాత్తు, ఎవరికీ ప్రాణాలు పోలేదు... చిన్న చిన్న గాయాలతో బయట పడ్డారు...
అయితే, వారి గుడిసెలు తగలుబెట్టింది, YSRCPపార్టీకి చెందిన వారే అని, బాధితులు ఆరోపిస్తున్నారు... దీని వెనుక ZPTC రామి రెడ్డి ఉన్నాడని, అతన్ని వెంటనే అరెస్ట్ చెయ్యాలి అంటూ, బాధితులు ధర్నా చేసారు... పిడుగురాళ్ల పట్టణంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు...స్థాలాలు కేటాయింపు సమయంలో కూడా, వీరు వచ్చి అధికారులకి అడ్డు పడ్డారని, బాధితులు ఆరోపిస్తున్నారు... ఆ సమయంలో కూడా పోలీసు బందోభస్తు మధ్య పట్టాలు తీసుకున్నామని అంటున్నారు... ఇక్కడ మాకు ఇచ్చిన భూమి కొట్టేయటానికి, వైసీపీ నేతలు ప్లాన్ చేసారు అని, అది కుదరకపోగా, ప్రభుత్వం ఆ స్థాలం మాకు ఇవ్వటంతో, మమ్మల్ని ఇక్కడ నుంచి గెంటేసి, ఈ స్థలం నొక్కేయటానికి, వైసీపీ నేతలే మా గుడిసెలు తగలు పెట్టారని, పోలీసులకి చెప్పారు బాధితులు.. పోలీసులు విచారణ చేస్తున్నారు...