కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అభిప్రాయం తెలుసుకోవటానికి, అలాగే ఇటీవల జరుగుతున్న పరిణమాల పై జాతీయ ఛానల్ newsx చంద్రబాబుతో ఇంటర్వ్యూ చేసేంది... ఈ ఇంటర్వ్యూ లో చంద్రబాబు తన మనుసులో మాట చెప్పారు... నాకు కేంద్రంలో పదవులు ముఖ్యం కాదు, మా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ముఖ్యం... దాని కోసం ఎంత వరుకు అయినా తగ్గుతా... స్పెషల్ స్టేటస్ ఇస్తాను అన్నారు, కాదు అని స్పెషల్ ప్యాకేజి ఇచ్చారు... దాని కోసం పోరాడుతున్నా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి పోలవరం.... దానికి ఇబ్బందులు వచ్చాయి... మూడు నెలలు పోరాడి సాధించుకున్నాం, అని చంద్రబాబు అన్నారు...

cbn national 31012018

నేను ఆశావాదిని, పోరాడుతూనే ఉంటా... రాష్ట్రానికి చెడు జరుగుతుంది అనుకున్న రోజు మాత్రం, రాష్ట్ర ప్రయోజనాలు కంటే నాకు ఏది ఎక్కువ కాదు... ప్రధానిని కలిసాను, అన్ని విషయాలు చెప్పను... ఈ బడ్జెట్ లో మాకు ఎక్కువ కేటాయింపులు వస్తాయి అని అనుకుంటున్నాం అని చంద్రబాబు అన్నారు... మాది కొత్త రాష్ట్రము, అనేక సమస్యలు ఉన్నాయి... కొట్టుకుంటా కూర్చుంటే, మాకు వచ్చేవి కూడా రావు... అందుకే ఓర్పుగా, నా స్థాయి తగ్గించుకుని కూడా, రాష్ట్రం కోసం, కేంద్రం దగ్గర తల వంచుతున్నా అంటూ చంద్రబాబు అన్నారు...

 style=

మోడీ నాయకత్వంలో పాని చెయ్యటానికి, అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో పని చెయ్యటానికి తేడా ఏంటి అని అడగగా, చంద్రబాబు సమాధానమిస్తూ "అటల్ బిహారీ వాజపేయి సమయంలో మా అవసరం వారికి ఉంది... మేము లేకపోతే ఆ రోజు ప్రభుత్వం పడిపోయేది... వారిని ఇబ్బంది పెట్టకుండా, రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెచ్చుకునే వాళ్ళం... అటల్ బిహారీ వాజపేయి సహకరించే వారు... ఇప్పుడు మోడీకి, మెజారిటీ ఉంది... మేము మద్దతు ఇవ్వకపోయినా వారికి పోయేది ఏమి లేదు... అందుకే వారితో పోరాడుతూ పనులు సాధించుంటాం... ఇద్దరి పని తనాన్ని, మనస్తత్వాలని కంపేర్ చెయ్యటం కరెక్ట్ కాదు, ఎవరి స్టైల్ వాళ్ళది అంటూ" చంద్రబాబు తెలివిగా తప్పించుకున్నారు... అయితే ఇంటర్వ్యూ మొత్తంలో చంద్రబాబు పదే పదే చెప్పిన మాట "మా రాష్ట్రానికి నిధుల కోసం పోరాడుతూనే ఉంటా... ఓర్పుగా సాధించుకుంటా... ఆ విషయంలో తేడా వస్తే మాత్రం, రాష్ట్ర ప్రయోజనాలు కంటే నాకు ఏది ఎక్కువ కాదు" అనే మెసేజ్ మాత్రం గెట్టిగా ఇచ్చారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read