ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలకు, జాతీయ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నుంచి పిలుపు వచ్చింది... హుటాహుటిన ఢిల్లీ రావాలని ఆంధ్రా బీజేపీ నేతలకు పిలువు వచ్చింది... ఆంధ్రా బీజేపీ నేతలతో పాటు, తెలంగాణా బీజేపీ నేతలను కూడా రమ్మిని కబురు పంపించారు... ఈ నేపధ్యంలో నేతలు ఈ రోజు సాయంత్రం ఢిల్లీ పయానం అవ్వనున్నారు... రేపు ఢిల్లీలో అమిత్ షా తో, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు, అదే విధంగా తెలంగాణా బీజేపీ నేతలు, సమావేశం కానున్నారు... రేపు ఉదయం ఢిల్లీలోని అమిత్ షా నివాసంలోనే ఇరు రాష్ట్రాల నేతలు అమిత్ షా తో భేటీ కానున్నారు...
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రధానంగా విభజన హామీలు, ఆ పై రాజకీయ పరిస్థుతులు గురించి అమిత్ షా మాట్లాడనున్నారు... ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్, కాపు రిజర్వేషన్ అంశం పై వీరితో చర్చించి, వారి అభిప్రాయలు తీసుకోనున్నారు... అదే విధంగా, ఈ మధ్య కాలంలో రాష్ట్ర బీజేపీ నేతలు, చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చెయ్యటం, దానికి చంద్రబాబు ఘాటుగా స్పందించటం, అవసరం అయితే, మీకు దండం పెడతా అనటం, ఈ వ్యాఖ్యలు నేషనల్ మీడియాకు హైలైట్ చెయ్యటంతో, ఢిల్లీ బీజేపీ నేతలు కూడా వీటికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా, రాష్ట్ర బీజేపీ నేతలకు క్లాసు పీకే అవకాసం ఉన్నట్టు సమాచారం...
అదే విధంగా ఇరు రాష్ట్రాలు అయిన, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన హైకోర్టు విభజన అంశంతో పాటు, అసెంబ్లీ స్థానాల పెంపు పై, అటు తెలంగాణా, ఇటు బీజేపీ నేతలతో చర్చించనున్నారు... వీరితో చర్చించిన తరువాత, అటు టీఆర్ఎస్ , ఇటు టీడీపీ నేతలతో కూడా అమిత్ షా చర్చించి, దీని పై కూడా రేపే కీలక ప్రకటన చేసే అవకాసం ఉంది... ఈ సమావేశానికి రావాల్సిందిగా ఏపీ నుంచి హరిబాబు, విష్ణుకుమార్ రాజు, అదే విధంగా తెలంగాణ నుంచి లక్ష్మణ్, కిషన్ రెడ్డికి సమాచారం అందింది...