రెండు నెలల క్రిత్రం విజయవాడలో ఆడిన జగన్నాటకం గుర్తుందా... వంగవీటి రంగాను చంపడం తప్పు కాదు అంటూ, వైఎస్ జగన్ దగ్గరి బంధువు, గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలతో, కాపుల ఆగ్రహానికి గురై, గౌతంరెడ్డిని పార్టీ నుండి సస్పెన్షన్ చేస్తూ జగన్ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే... అయితే అప్పట్లో, ఈ ఎపిసోడ్ అంతా, జగనే దగ్గరుండి చేపించారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి... వంగవీటి రాధా కూడా, ఇలాంటి వెధవలను పార్టీ ప్రోత్సహించ బట్టే పార్టీ ఇలా ఉంది అంటునే, మా అరెస్ట్ తో ప్రభుత్వానికి సంబంధం లేదు అని కూడా అన్నారు.
ఇవన్నీ పక్కన పెడితే, సస్పెండ్ అయిన తరువాత, ఎవరన్నా మాట్లాడకుండా ఉంటారా ? రాధ అన్ని బూతులు తిడితే, కనీసం గౌతం రెడ్డి, వాటికి సమాధానం ఇవ్వలేదు... గౌతం రెడ్డి ఇంటి ముందు, దసరా, దీపావళి శుభాకాంక్షలు అంటూ, జగన్ ఫోటులు వేసి ఉన్న బానేర్లు, ఫ్లెక్స్ లు వేసుకున్నాడు... ఇవి అన్నీ నడుస్తూ ఉండగానే, గౌతం రెడ్డి రెండు రోజుల క్రిందట వెళ్లి జగన్ ను బహిరంగంగా కలిసి సంచలంనం సృష్టించారు... సస్పెండ్ అయిన వ్యక్తి, వెళ్ళి డైరెక్ట్ గా జగన్ ను ఎలా కలుస్తారు అంటూ, అందరూ ఆశ్చర్యపోయారు... అయితే, ఇవాళ అసలు విషయం చెప్పేశారు, గౌతం రెడ్డి...
తాను ఇంకా పార్టీలోనే కొనసాగుతున్నట్లు గౌతం రెడ్డి ఇవాళ ప్రకటించారు. వంగవీటి రంగా మీద చేసిన వ్యాఖ్యల విషయంలో, కాపులు ఆందోళనకు దిగడంతో షోకాజ్ నోటీసు ఇచ్చి, సమాధానం చెప్పకుండానే, పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు జగన్ ప్రకటించారు...అయితే వైసీపీ నుంచి తనకు ఎలాంటి సస్పెన్షన్ ఉత్తర్వులు అందలేదని, ఇవాళ గౌతమ్ రెడ్డి చెప్పారు... తనని అసలు ఎవరూ సస్పెండ్ చెయ్యలేదు అంటూ, గౌతం రెడ్డి చెప్పిన మాటలతో, జగన్ చేసింది అంతా డ్రామానే అనే విషయం అర్ధమైంది... మరి, ఇప్పుడు వంగవీటి రాధా ఎలా స్పందిస్తారో చూడాలి...