కేంద్ర బడ్జెట్ పై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అన్యాయం పై, రాష్ట్రంలోని ప్రజలందరూ, కేంద్ర వైఖరి పై విరుచుకుపడుతున్నారు... ఇదే సందర్భంలో, ఎన్డీయే లో భాగస్వామ్యం అయిన, అధికార తెలుగుదేశం పార్టీ కూడా గుర్రుగా ఉంది... ‘‘విభజన చట్టంలో అనేక హామీలిచ్చారు. వాటిలో అనేకం ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. కానీ... వాటి గురించి బడ్జెట్లో ఒక్క మాటైనా ప్రస్తావించలేదు. రాష్ట్రానికి ఏమిటీ దురదృష్టం ? ఇప్పటికే అభివృద్ధి చెందిన అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు నగరాలకు నిర్దిష్ట కేటాయింపులు చేశారు... రాజధాని నగరం లేకుండా ఏర్పడిన నవ్యాంధ్ర గురించి పట్టించుకోలేదు. అమరావతికి చిన్నపాటి కేటాయింపులూ చేయలేదు. చట్టబద్ధ హామీలు, పార్లమెంటులో ఇచ్చిన హామీల గురించి కనీసం ప్రస్తావించలేదు" అంటూ తన బాధ, ఆవేదన, అసంతృప్తిని వ్యక్తం చేశారు....
మన కష్టానికి వారి సాయం కూడా జత కలిస్తే నిలబడగలమని మనం ప్రయత్నిస్తున్నామని, కానీ... నిరాశే ఎదురవుతోందని అన్నారు. ‘‘ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు మిత్రపక్షమైనప్పటికీ మాట్లాడకుండా ఎలా ఉండగలం!’ అని ప్రశ్నించారు. ‘‘రాష్ట్రం చిన్నది కావడం వల్లే ఢిల్లీకి మనం కనిపించడం లేదా అనే అనుమానం కలుగుతోంది’’ అని అన్నారు... ఎన్డీయే భాగస్వామిగా ఉంటూ, చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలతో, నేషనల్ మీడియాలో కూడా, ఈ విషయం పై విస్తృతంగా ప్రచారం జరుగుతుంది... తెలుగుదేశం బడ్జెట్ పై అసంతృప్తిగా ఉంది అని, ఎన్డీయే నుంచి బయటకు వచ్చేస్తుంది అంటూ కధనాలు వస్తున్నాయి...
ఇదే సందర్భంలో, తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ పై, అరుణ్ జైట్లీ, నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు... రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామికి ఇచిన ఇంటర్వ్యూలో జైట్లీ, ఆంధ్రప్రదేశ్ లో ప్రజల అసంతృప్తి, చంద్రబాబు ఆగ్రహం పై, అర్నబ్ అడిగిన ప్రశ్నలకు స్పందించారు... ఎదావిధిగా, పాడిన పాటే పాడారు... ప్రజలు ఇంత ఆందోళన చెందుతున్నా, వాటిని పట్టించుకోకుండా జైట్లీ మాట్లాడుతూ "మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బాగానే చేసాం... విభజన తరువాత రాష్ట్రం నష్టపోయింది అని తెలుసు... మేము చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం... పోలవరానికి నిధులు ఇస్తున్నాం... చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చాం" అంటూ పాడిన పాటే పాడారు... చంద్రబాబు కోపంగా ఉన్నారుగా అని అడితితే, అదేమీ లేదు, ఎందుకు ఉంటుంది, మేము చాలా చేసాం కదా అని జైట్లీ అన్నారు...