కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది... అనంతరం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకట్రెండు రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటాని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన సమస్యలకు బడ్జెట్‌లో పరిష్కరిస్తుందని ఆశించాం కానీ నిరాశే కలిగించిందని మంత్రి సోమిరెడ్డి అన్నారు... చంద్రబాబుతో అత్యవసర మీటింగ్ తరువాత, ఈ వ్యాఖ్యలు చెయ్యటంతో, ఎదో జరగబోతుంది అనే సంకేతం వచ్చింది...
సోమిరెడ్డి మాట్లాడుతూ, అమరావతికి ఎలాంటి నిధులివ్వలేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్ పార్టీ భేటీలోనూ ఈ విషయాన్ని గట్టిగానే చర్చిస్తామన్నారు. ముంబై, బెంగళూరుపై ఉన్న ప్రేమ అమరావతిపై చూపాలని కేంద్రానికి ఆయన సూచించారు. అలాగే రైల్వే జోన్ అంశం అసలు పట్టించుకోకపోవటం దారుణం అని అన్నారు... ప్రజల ఆకాంక్షలు నెరవేరకుంటే అవసరమైన నిర్ణయం తీసకుంటామని మంత్రి స్పష్టం చేశారు. సీఎం దగ్గర నిశితంగా అన్ని విషయాలపై చర్చించామని త్వరలో జరగనున్న ప్రత్యేక భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్లమెంటరీ భేటీలో చర్చించిన అనంతరం మరోసారి కేంద్ర మంత్రులతో మరోసారి చర్చించాలని సమావేశంలో సీఎం నిర్ణయించారని సోమిరెడ్డి స్పష్టం చేశారు...
ప్రధాని మోదీ సహా పలువురు కేంద్రమంత్రులకు విజ్ఞప్తి చేశామని, చాలా మేరకు నిధులు వస్తాయని ఆశించాం..కానీ.. బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేవని సోమిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు... అలాగే జగన్ గురించి మాట్లాడుతూ, వైసీపీకి దమ్ముంటే ఏపీకి న్యాయం చేయట్లేదని కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలన్నారు. మిత్రపక్షంగా మేం కేంద్రప్రభుత్వంపై తెచ్చిన ఒత్తిడి వైసీపీ ఎప్పుడైనా తెచ్చిందా? అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. రాజకీయం, ముఖ్యమంత్రి సీటు తప్ప ప్రతిపక్ష నేత జగన్‌కు మరేమీ తెలియదని సోమిరెడ్డి వ్యాఖ్యలు చేశారు...