స్థానికత ఆధారంగా ఏపీ విద్యుత్ ఉద్యోగుల రిలీవ్ వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మూడేళ్లుగా నడుస్తున్న ఈ వివాదంపై ఉమ్మడి హైకోర్టు తీర్పు వెలువరించింది. స్థానికత ఆధారంగా ఉద్యోగులను రిలీవ్ చేయడాన్ని తప్పుబట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానికత ఉన్న 1200 మంది ఉద్యోగులను రిలీవ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు పేర్కొంది. .. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ విద్యుత్ సంస్థలైన ట్రాన్స్కో, డిస్కంలలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
దీన్ని సవాల్ చేస్తూ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 58 శాతం, తెలంగాణ 42 శాతం జీతాలుగా చెల్లిస్తున్నాయి... ఇదే విషయం పై కోర్ట్ కి వెళ్లారు... ఈ వివాదంపై సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు ఉద్యోగుల రిలీవ్ను తప్పుబడుతూ శుక్రవారం తీర్పు వెలువరించింది.... తెలంగాణా ప్రభుత్వానికి గెట్టి మొట్టికాయ వేసింది హై కోర్ట్
గెట్టిగా మొట్టికాయి వెయ్యటమే కాదు, దీంతో పాటు ఉద్యోగులకు వేతనంగా చెల్లించిన మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్టానికి తిరిగి చెల్లించాలని పేర్కొంది. ఉద్యోగుల వివాదంపై ఒక కమిటీ ఏర్పాటు చేసి నాలుగు నెలల్లో విభజన ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది... ఇదే విధంగా విద్యుత్ బకాయులు గురించి కూడా తీర్పు వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్టానికి తెలంగాణా నుంచి 4 వేల కోట్ల బకాయలు వస్తాయి... కేంద్రంతో పెట్టుకుంటే ఇవి అయ్యే పనులు కాదు, రాష్ట్ర ప్రభుత్వం కోర్ట్ కి వెళ్లి ఇది కూడా సాధించాలి...