కేంద్రం బడ్జెట్ పై, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర స్థాయిలో బీజేపీ పై విరుచుకుపడుతుంటే, నేతలతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మాత్రం, పుండు మీద కారం చల్లుతూ, వ్యాఖ్యలు చేసారు... నిన్న ఢిల్లీలో రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం అయ్యారు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు, శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు, పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ లాంటి ఉద్దండులతో చర్చించారు... సుమారు గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో అమిత్ షా, మాట్లాడుతూ, కేంద్రంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు భయపడాల్సిన పని లేదని అమిత్ షా అన్నారు...
ఈ నేతలు అందరూ, బడ్జెట్ పై తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తుంది అంటూ, అమిత్ షా కి కంప్లైంట్ చేసారు... దానికి అమిత్ షా మాట్లాడుతూ, "అదేమిటీ.. మనం రాష్ట్రానికి అడిగినవన్నీ ఇస్తున్నాము కదా... ఎన్నో చేసాం... ఎన్నో ఇచ్చాం... ఇలాంటి వ్యాఖ్యలకు మీరేమీ భయపడనక్కర్లేదు... బూత్‌స్థాయి నుంచీ పార్టీని బలోపేతం చేయండి. కేంద్రంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు జవాబివ్వండి" అంటూ అమిత్ షా గీతోపదేశం చేసి పంపించారు... గతంలో రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెంలో తాను పర్యటించానని ఈసారి రాయలసీమలో పర్యటిస్తానని అమిత్ షా ప్రకటించి, ధైర్యంగా ముందుకెళ్ళమన్నారు...
విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు ఇప్పటికీ కేంద్రం పరిశీలనలో ఉందని, నాలుగేళ్ళ నుంచి పాడిన పాటే పాడారు... అమరావతి అభివృద్ధికి ఇంకా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు.. వేయం పెంచకుండా పాత ధరలకే పోలవరం కాంట్రాక్ట్ ను నవయుగా అప్పజెప్పి గడ్కరీ ప్రజాదననాన్ని ఆదా చేశారు... అయ్యా, అమిత్ షా గారు, ఇది టీడీపీ వ్యవహారం కాదు, మీ మీద విమర్శలు చేస్తుంది, ఆంద్ర రాష్ట్ర పజలు... రాష్ట్ర ప్రజలకు కూడా మేము భయపడం అంటే, ప్రజలు తగిన సమాధానం చెప్తారు... చివరగా నవయుగకు పోలవరం అప్పచెప్పింది, మా ముఖ్యమంత్రి... తమరు పోలవరంలో ఎన్ని అడ్డంకులు సృష్టించారో అందరికీ తెలుసు...