ముఖ్యమంత్రి కుర్చీ కోసం అంటూ యాత్ర పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రం అంతటా తిరుగుతున్న సంగతి తెలిసిందే... ఇవాళ కొంచెం ఎర్లీగా బ్రేక్ ఇచ్చి, ఒక జాతీయ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు జగన్... ఆ ఇంటర్వ్యూ లో మోడీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు... బీజేపీ కనుక మేము, ప్రత్యెక హోదా ఇస్తాము అని ప్రకటిస్తే, బీజేపీతో కలుస్తాము అంటూ, బంపర్ ఆఫర్ ఇచ్చారు... అక్కడకి ఎదో బీజేపీ, జగన్ కోసమే ఎదురు చూస్తున్నట్టు, వాళ్ళకే ఆఫర్ ఇచ్చారు... జగన్, కలవకపోతే, మోడీ మళ్ళీ ప్రధాని అవ్వరు అని జగన్ ఫీల్ అవుతున్నాడో ఏమో కాని, దావోస్ లో ఉన్న మోడీ ఈ మాటలు విని, ఎలా ఫీల్ అయ్యారో పాపం...
జగన్ మాట్లాడుతూ " ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తే 2019లో బీజేపీతో కలిసి వెళ్తా... మా ప్రధాన టార్గెట్ చంద్రబాబే.... హోదా హామీ నిలబెట్టుకుంటే మరో ఆలోచన లేకుండా బీజేపీతో అడుగులు వేస్తా.... కాంగ్రెస్ లో ఉన్నప్పుడు గౌరవనీయ వ్యక్తిగానే ఉన్నా..." అంటూ జగన్ చెప్పారు... అంతేనా యధావిధిగా చంద్రబాబు పై ఆరోపణలతో విరుచుకుపడ్డారు... ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటివరకు రాష్ట్రంలో ఏమి జరగటంలేదు అని అన్నారు... అంతే కాదు, తనకిష్టమైన డైలాగ్ త్వరలో "నేనే సియం" అని చాలా సార్లు అన్నారు కూడా..
జగన్ వ్యాఖ్యలు ఎంతో హాస్యాస్పదంగా ఉన్నాయి... ఒక పక్క బీజేపీ ఇప్పటికే, ప్రత్యేక హోదా ముగిసిన చరిత్ర అని చెప్పింది... ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పింది... ఒక పక్క పోలవరం పర్మిషన్ లు లేట్ అవుతున్నాయి... మరో పక్క నిధులు ఆలస్యం అవుతున్నాయి... హైదరాబాద్ ఉమ్మడి ఆస్తులు మీద ఇప్పటి వరకు ఏమి లేదు... మరి జగన్ ఇలాంటి వాటి మీద మాత్రం మాట్లాడడు..కేంద్రాన్ని ఏ నాడు ఒక్క మాట అనడు... కాని, బీజేపీ ఇస్తాను అంటే పొత్తు పెట్టుకుంటాడు అంట... ప్రతిపక్షంలో ఉండి, మా రాష్ట్రానికి ఇది కావలి అని పోరాడాలా ? లేక పొత్తు కోసం డ్రామాలు ఆడాలా ? మోడీ అంటే అంత భయమా ? ఇవ్వను అంటున్న బీజేపీ పొత్తు కోసం వెంపర్లాడటం ఎందుకు, కాంగ్రెస్ పార్టీ మేము అధికారకంలోకి వస్తే, ప్రత్యేక హోదా ఇస్తాము అంటుందిగా, కాంగ్రెస్ తో పొత్తు ఎందుకు పెట్టుకోవు ? ఎందుకంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాసం లేదు... మళ్ళీ మోడీనే వస్తాడు, మన కేసులు ఇంకో పదేళ్ళు లేటు చేసుకోవచ్చు అనే స్వార్ధం...