ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం జూరిచ్ చేరుకుంది... జూరిచ్ చేరుకున్న చంద్రబాబు బృందానికి ఘన స్వాగతం లభించింది... పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా, ఆదివారం రాత్రి 9.30 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం నుంచి డీల్లీకి వెళ్లారు. అక్కడి నుంచి దావోస్ బయలుదేరారు. కొద్ది సేపటి క్రిత్రం జూరిచ్ చేరుకునంరు... దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనున్నారు. ఈ పర్యటనలో వ్యవసాయం, ఔషధరంగం, సోలార్ ఎనర్జీ, ఐటీ, మౌళిక వసతులు వంటి కీలక రంగాలకు సంబంధించిన ఎఓంఓయూలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోనుంది.
వరల్డ్ ఎకనామిక్ సదస్సు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపన ఇప్పటికే ఏపీ పారిశ్రామిక ప్రగతి రథం దావోస్లో చక్కర్లు కొడుతుంది. గత రెండేళ్లగా దావోస్ పర్యటనలో భాగంగా ఏపీ ప్రభుత్వం అనేక కీలక పెట్టుబడులను తీసుకురాగలిగింది. ఈ సారి వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో కీలకమైన ఉపన్యాసాల్లో ప్రధాన వక్తగా చంద్రబాబు ఉండబోతున్నారు. దీంతో పాటు ప్రధాన మంత్రి మోదీతో ఆయన గంటన్నర పాటు గడపనున్నారు. గతం కంటే భిన్నంగా ఈసారి వ్యవసాయ-భవిష్యత్తు, ఆహార భద్రత, గ్లోబల్ ఫండ్, ఐటీ ఇన్ ప్రాస్రక్టర్, మాన్యుఫాక్పరింగ్ తదితర అంశాల పై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టనుంది. దావోస్కు వచ్చే పారిశ్రామిక వేత్తలను, వచ్చే నెలలో రాష్ట్రంలో జరగబోయే సిఐఐ సదస్సుకు సీఎం చంద్రబాబు ఆహ్వానించునున్నారు.
దావోస్ పర్యటనలో మొదటిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రారంభ సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. అదేరోజు డీఐపిపి ఏర్పాటు చేసే ఇండియా రిసెప్శన్ కు హాజరవుతారు. రెండోరోజు ఏపీ లాంజ్ లో జరిగే ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అదే రోజు మధ్యాహ్నం నుంచి స్థానిక ప్రముఖులు, అంతర్జాతీయ కంపెనీల సీఈవోలతో చంద్రబాబు వరుసగా సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎపీ లాంజ్ ను సందర్శిస్తారు. ఇండియూ లాంజ్లో ఏపీ-జపాన్ భోజన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గుంటారు... మూడో
రోజు మధ్యాహ్నం 12 గంటలకు హోటల్ టెల్విడర్ లో లంచ్ ఆన్ మీటింగ్ సమావేశంలో పాల్గుంటారు. ఈ నాలుగు రోజుల పర్యటనలో మొత్తం మూడు ఎంవోయూలను రాష్ట్ర ప్ర భుత్వం చేసుకోనుంది.