వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పెద్ద కొడకునంటూ విర్రవీగి, సహజ వనరులని దోచుకుని, చివరకి జైలు పాలు అయ్యి, బెయిల్ పై బయట తిరుగుతున్న, గాలి జనార్దన్‌రెడ్డి కి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది... గాలి జనార్ధన్ రెడ్డి, ఇప్పుడు వైఎస్ జగన్ లాగానే, బెయిల్ పై బయట తిరుగుతున్న సంగతి తెలిసిందే... అయితే గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్ ఇచ్చినప్పుడు, కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది సుప్రీమ్ కోర్ట్... ఆ షరతులతో పాపం గాలి, ఇబ్బంది పడుతున్నాడో ఏమో, వాటి పై మళ్ళీ సుప్రేం కోర్ట్ కు వెళ్ళాడు...

gali 22012018 2

నాకు బెయిల్ ఇచ్చినప్పుడు పెట్టిన షరతులు ఎత్తివేయండి, సవరించండి అంటూ సుప్రీం కోర్ట్ లో గాలి జనార్ధన్ రెడ్డి పిటీషన్ దాఖలు చేసారు... ఈ పిటీషన్ పై సుప్రీం కోర్ట్ విచారణ చేసింది... ఇరు పక్షాల వాదనలు సుప్రీం కోర్ట్ విన్నది.. అయితే గాలి జనార్దన్‌రెడ్డి న్యాయవాదుల వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. బెయిల్ నిబంధనలను సడలించకూడదని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో జగన్ విషయం కూడా వార్తల్లోకి వచ్చింది...

gali 22012018 3

జగన్ కూడా ఇలాంటి కేసులోనే అరెస్ట్ అయ్యి, 16 నెలలు జైలులో ఉండి, బెయిల్ పై బయట తిరుగుతున్నాడు... ప్రస్తుతం, ఈడీ, సిబిఐ విచారణకు ప్రతి శుక్రవారం హాజారు అవుతున్నాడు... జగన్ కూడా త్వరలో బెయిల్ నిభందనలు సవరించమని, అవి తన రాజకీయ యాత్రలకి ఇబ్బంది అవుతున్నాయని, త్వరలో కోర్ట్ లో పిటీషన్ వేస్తాడు అనే వార్తలు వస్తున్నాయి... మరి ఇప్పుడు గాలి జనార్ధన్ రెడ్డికి ఇచ్చిన తీర్పు నేపధ్యంలో, జగన్ కు కూడా ఇలాంటి ఎదురుదెబ్బే తగిలే అవకాశం ఉంది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read